Home > సినిమా > ఇలియానాకు పండంటి బిడ్డ.. ప్రియుడి పేరు అదేనా?

ఇలియానాకు పండంటి బిడ్డ.. ప్రియుడి పేరు అదేనా?

ఇలియానాకు పండంటి బిడ్డ.. ప్రియుడి పేరు అదేనా?
X

దక్షిణాదితోపాటు బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన బోల్డ్ బ్యూటీ ఇలియానా డి క్రుజ్ (Ileana D'Cruz) తల్లి అయింది. ఈ నెల 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చానని ఆమె సోషల్ మీడియాలో తెలిపింది. బిడ్డ ఫొటో, పేరును కూడా పోస్ట్ చేసింది. ‘‘మా అబ్బాయి కోవా ఫీనిక్స్ డోలన్‌ను పరిచయం చేస్తున్నాను. మా మనసులను దాటి ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని చెప్పడానికి మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది’’ అని కామెంట్ పెట్టింది.

ఇలియానా పెళ్లికాకుండానే గర్భం దాల్చి వార్తలకెక్కడం తెలిసింది. ప్రియుడి ఫోటోను కూడా పరిచయం చేసింది. అయితే అతని పేరేమిటో బయటపెట్టలేదు. కొడుకు పేరులో డోలన్ అని ఉండడంతో అది ప్రియుడి ఇంటి పేరు కావొచ్చని, అతడు విదేశీయుడే అయి ఉంటాడని ఊహాగానాలు వస్తున్నాయి. కోవా అంటే యోధుడి అనే అర్థం ఉందట. తన గర్భం దాల్చానని ఇలియానా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో తెలిపింది. గర్భధారణ, బిడ్డపుట్టడంతో ప్రస్తుతానికి ఆమె సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు కొన్నేళ్లు గ్యాప్ ఇవ్వనుంది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం రవితేజ హీరోగా వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. తర్వాత కొన్ని హిందీ వెబ్ సిరీస్‌లు చేసింది.



Updated : 6 Aug 2023 7:54 AM IST
Tags:    
Next Story
Share it
Top