Heroine Jayaprada : కోర్టులో లొంగిపోయిన సీనినటి జయప్రద
X
సీనినటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల టైంలో కోడ్ ఆఫ్ కండక్ట్ ను మీరినందుకూ ఆమెపై రాంపూర్‌లో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో ఆమెకు కోర్టు చాలా సార్లు నోటీసులు, వారెంట్లు జారీ చేసింది. అయినప్పటికీ వాయిదాలకు జయప్రద హాజరుకాకుండా డుమ్మా కొట్టారు. దీంతో కోర్టు ఆమెపై వారెంట్ తో పాటు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. జయప్రదపై కోర్టు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినప్పటికీ ఆమె కోర్టు ఎదుట హాజరుకాలేదు.
దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాంపూర్ కోర్టు ఫిబ్రవరి 27న మాజీ ఎంపీ, నటి జయప్రద పరారీలో ఉన్నట్లు తెలిపింది. సీఆర్పీసీ 82 సెక్షన్ కింద ఆమెపై చర్యలు తీసుకుంటూ ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని చెప్పింది. వచ్చే నెల 6వ తేదీన జయప్రదను ఎట్టిపరిస్థితుల్లో కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. దీంతో జయప్రద ఇవాళ రాంపూర్ కోర్టులో లొంగిపోయారు.