Home > సినిమా > లిప్ లాక్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ సినిమాను వదిలేసుకుంది

లిప్ లాక్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ సినిమాను వదిలేసుకుంది

లిప్ లాక్స్ ఉన్నాయని బ్లాక్ బస్టర్ సినిమాను వదిలేసుకుంది
X

త్వరలో మెగా ఫ్యామిలీ ఇంటిరి కోడలిగా వెళ్లబోతోంది.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి. మిస్టర్ సినిమాతో హీరో వరుణ్ తేజ్ తో మొదలైన ఆమె పరిచయం.. ప్రేమగా మారి.. త్వరలోనే ఆ హ్యండ్సమ్ హీరోకి బెటర్ హాఫ్ కాబోతుంది. కల్మషం లేని మనసు, ఇతరులకు సాయపడాలన్న ఆమె స్వభావం నచ్చే వరుణ్.. లావణ్యపై మనస్సు పడ్డట్టు టాక్. అందుకు రుజువుగా ఆమె చేసిన సినిమాలు.. కూడా అదే విధంగా ఉంటాయి. తాను చేయబోయే ప్రతీ సినిమాకు ముందే టర్మ్స్ అండ్ కండీషన్స్ గురించి చెబుతుందట లావణ్య. అందుకే ఇప్పటి వరకూ ఏ సినిమాలో కూడా బెడ్ సీన్స్ కానీ.. లిప్ లాక్‌లు కానీ చేసింది లేదు. లిప్ లాక్‌లు ఉంటే చేయనని పక్కాగా చెప్పేస్తుందట. అందుకే ఆమె ఇప్పటి వరకూ చాలా సినిమాలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది.

మరీ ముఖ్యంగా కేవలం ఒక చిన్న కారణంతోనే బ్లాక్ బస్టర్ సినిమాని రిజెక్ట్ చేశారట లావణ్య. ఆ మూవీ రిలీజ్ అయ్యి.. సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అయినా సరే తన నిర్ణయం విషయంతో సంతృప్తిగా ఉందట లావణ్య. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. విజయ్ దేవరకొండ, రష్మిక హీరో హీరోయిన్లుగా నటించిన గీత గోవిందం. దర్శకుడు పరశురామ్ ముందుగా ఈ సినిమాలో రష్మిక బదులు హీరోయిన్ గా లావణ్యను అనుకున్నారట. అయితే ఈ మూవీలో లిప్ లాక్ సన్నివేశం ఉండటంతో లావణ్య నో చెప్పిందని తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో ఈ సినిమా కంటే ముందు వచ్చిన శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాలో లావణ్య హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే

ఇక గీతగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ అయింది రష్మిక. ఆ హిట్ తోనే పుష్ప సిరీస్‌లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప.. ది రైజ్' ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక నెక్స్ట్ పార్ట్ 'పుష్ప ది రూల్' షూటింగ్ దశలో ఉంది.

Updated : 22 Jun 2023 10:47 PM IST
Tags:    
Next Story
Share it
Top