నితిన్ 'తమ్ముడు'తో లయ రీఎంట్రీ
X
అచ్చతెలుగు అమ్మాయి లయ మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. చూడగానే తెలుగుదనం ఉట్టిపడే హీరోయిన్లలో లయ కూడా ఒకరు. హీరో వేణు తొట్టెంపూడి తొలి సినిమా 'స్వయంవరం'తో తెలుగు తెరకు ఈ ముద్దుగుమ్మ పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టింది. కెరీర్ పీక్ రేంజ్‌లో ఉన్నప్పుడే గణేష్ అనే అతడ్ని పెళ్లాడి సినిమాలకు దూరమైంది. 30 సినిమాల వరకూ హీరోయిన్‌కు నటించిన లయ ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మదిలో అలానే నిలిచిపోయింది.
చాలా కాలం తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో హీరో రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోనీలో లయ ఓ చిన్న పాత్ర చేసింది. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా అందులో నటించడం విశేషం. ఇక ఆ మూవీ తర్వాత ఆమె కనిపించలేదు. ఈ మధ్య లయ ఇంటర్వ్యూలు చేస్తూ, తన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ నితిన్ నటిస్తున్న 'తమ్ముడు' మూవీతో రీఎంట్రీ ఇస్తోంది.
హీరో నితిన్‌కు అక్కగా లయ కనిపించనుందట. ఈ మధ్యనే ఈ మూవీ షూటింగ్‌లో లయ ఉన్న ఫోటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. 'తమ్ముడు' మూవీ తనకు మంచి ఆఫర్లను తీసుకొస్తుందని, మళ్లీ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ అవుతానని లయ అనుకుంటోందట. మరి నితిన్ మూవీ తర్వాత లయ ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలి.