Mrunal Thakur : ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు అన్నారు..మృణాల్ ఠాకూర్
X
(Mrunal Thakur) ఫిలిమ్ ఇండస్ట్రీలో అవమానాలు, పొగడ్తలు సర్వసాధారణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరో, హీరోయిన్ల దాక ఎందరో ఆ అవమానాల దశ దాటుకొని వచ్చినవాళ్లే. తన తొలి చిత్రం సీతారామంతోనే తెలుగు ఆడియన్స్ ను తన వైపు తిప్పుకున్న అందాల భామ మృణాల్ ఠాకూర్. సీతా క్యారెక్టర్ తో తన అందాలు, నటనతో సిని ప్రేక్షకుల హృదయాల్లో తనదైన ముద్ర వేసి మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది. అయితే కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు.
సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యారు హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతా అనే క్యారెక్టర్ ద్వారా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. అటు తాజాగా వచ్చిన హాయ్ నాన్నలో ఫుల్ ఎమోషన్స్ తో యశ్నగా ఆడియన్స్ ను ఏడిపించేసారు. టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే రెండు సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఆమె బిజీ బిజీగా ఉన్నారు. అయితే కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను ఆమె పంచుకున్నారు.
తనకు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. కానీ సౌత్‌లో వస్తోన్నంత మంచి పాత్రలు అక్కడ మాత్రం రావడం లేదని తెలిపారు. అందుకే బాలీవుడ్ లో నటించేందుకు సిద్ధంగా లేనట్లు చెప్పారు. తనను తాను నిరూపించుకునే సినిమాల్లో నటించాలని తన కోరికగా తెలిపారు. అందుకోసం తల్లి, అక్క పాత్రలను పోషించాల్సి వచ్చినా భయపడనని తేల్చి చెప్పారు. ఏడాదికి ఐదు సినిమాల్లో నటించాలనే లక్ష్యం ఏం లేదని...చేసేది ఒక్క సినిమానే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోతే చాలని అభిప్రాయపడ్డారు.
తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో కొందరు తనను బాడీ షేమింగ్ చేశారని చెప్పుకొచ్చారు. అంతేగాక గ్లామర్ రోల్స్‌కు పనికిరానన్నారని తెలిపారు. అయితే ఓ సినిమా ఆడిషన్స్‌లో ఫొటోగ్రాఫర్ తనను చూసి ‘ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు?’ అన్నాడని చెప్పారు. అంతేగాక ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదుర్కొన్నానని మృణాల్ గుర్తు చేసుకున్నారు.
ఇక ఇటీవలే ‘హాయ్ నాన్న’తో హిట్‌ను అందుకున్న మృణాల్..ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star)లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ (Vijay devarakonda) హీరోగా నటిస్తున్న ఈ సినిమాని పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నారు. ‘గీత గోవిందం’ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. అంతేగాక ఇటీవల విడుదల చేసిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.