Home > సినిమా > అయ్యయ్యో మంచు విష్ణు.. హ్యాండిచ్చిన ‘కన్నప్ప’ హీరోయిన్

అయ్యయ్యో మంచు విష్ణు.. హ్యాండిచ్చిన ‘కన్నప్ప’ హీరోయిన్

అయ్యయ్యో మంచు విష్ణు.. హ్యాండిచ్చిన ‘కన్నప్ప’ హీరోయిన్
X

చాలా ఏళ్లుగా హిట్‌కు దూరమైన మంచు ఫ్యామిలీ హీరో విష్ణు చావో రేవో అన్నట్లు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమాకు ఆదిలోనే కష్టమొచ్చిపడింది. రూ. 70 కోట్లతో తీస్తున్న ఈ సినిమాకు హీరోయిన్ నుపుర్ సనన్ షూటింగ్ మొదలుకాకముందే హ్యాండిచ్చింది. మూవీకి డేట్లు సర్దుబాటు కాకపోవడతో ఆమె వెళ్లిపోవాల్సి వచ్చింది విష్ణు స్వయంగా వెల్లడించాడు.

‘‘ఈ విషయం చెప్పడానికి చాలా బాధగా ఉంది. ఆమెను మిస్ అవుతున్నాం. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాం. నుపుర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా ఆమె చేసే మిగతా సినిము విజయం సాధించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మేమిద్దరం మళ్లీ కలసిచేసే అకాశం వస్తుందని ఆశిస్తున్నాను. ఉత్తేజకరమైన రోజులు ముందున్నాయి’’ అని ట్వీట్ చేశాడు.

మంచు ఫ్యామిలీ ఇజ్జత్ కా సవాల్ అని తీస్తున్న ఈ మూవీలో ప్రభాస్ శివుడి పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ విషయం నిర్ధారణైతే కాలేదు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు బాబు కన్నగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా, తోట ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ మాటలు రాస్తున్నారు. కథను తనికెళ్ల భరణి కథను సమకూరుస్తున్నారు. మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. కృష్ణం రాజు సూపర్ హిట్ మూవీ ‘భక్త కన్నప్ప’ లెవల్లో చిత్రం ఉంటుందని, హాలీవుడ్ టెక్నీషియన్లతో గ్రాఫిక్ జోడిస్తామని మూవీ టీమ్ చెబుతోంది.

Updated : 20 Sept 2023 10:45 PM IST
Tags:    
Next Story
Share it
Top