ఎక్కడున్నా జనం తన గురించి చెప్పుకోవాల్సిందే....
X
ఏడాది పాటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తన వ్యాధి మయోసైటిస్ చికిత్స్ కోసం అమెరికా వెళ్ళనుంది సమంత. దాని కన్నా ముందు బాలిలో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది బేబి. సినిమాలకు దూరం అని చెప్పింది కానీ ఫ్యాన్స్ ను మాత్రం తన ఫోటోలతో, ఇన్స్టా పోస్ట్ లతో మాత్రం అలరిస్తూనే ఉంది.
సోషల్ మీడియాలో సామ్ బేబీ ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. చై తో విడిపోయినప్పుడు, తనకు వితం వ్యాధి వచ్చినప్పుడు అన్ని సందర్భాల్లో కూడా ఫ్యాన్స్ తో తన విషయాలను పంచుకుంటూనే ఉంది. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో తన ఫ్రెండ్స్ తో వెకేషన్ కు వెళ్ళింది. అక్కడ రకరకాల లొకేషన్లలో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంది. ఆల్ మోస్ట్ రోజుకో వీడియో, ఫోటో షేర్ చేస్తూనే ఉంది. నిన్ననే జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో పెట్టింది. ఇవాళేమో ఐస్ బాత్ అంటూ మరో ఫోటో పెట్టింది. నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ఐస్ బాత్ అని రాసుకొచ్చింది.
ఈ ఐస్ థెరపీ బాత్ ఫోటో చూసి...ఇది మయోసైటిస్ చికిత్సలో భాగమా అంటూ కామెంటస్ చేస్తున్నారు. ఎందుకంటే కూడా ఓసారి సమంత ఐస్ ముక్కలు ఉన్న టబ్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది అని రాసింది. అందుకే ఇప్పుడు కూడా చికిత్సలో భాగంగా ఐస్ బాత్ చేస్తున్నావా అని అడుగుతున్నారు.
సమంత ఏడాది పాటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తన వ్యాధికి చికిత్స తీసుకోవడానికి కూడా చెప్పింది. ఈ గ్యాప్ లో తను నటించిన ఖుషి సినిమా, సిటాడెల్ ఇండియన్ వెర్షన్ సిరీస్ లు విడుదల అవనున్నాయి.