Home > సినిమా > సమంత ట్రీట్‌మెంట్‌కు ఓ స్టార్ హీరో 25 కోట్లు ఇచ్చాడా?

సమంత ట్రీట్‌మెంట్‌కు ఓ స్టార్ హీరో 25 కోట్లు ఇచ్చాడా?

సమంత ట్రీట్‌మెంట్‌కు ఓ స్టార్ హీరో 25 కోట్లు ఇచ్చాడా?
X

అరే ఏమనుకుంటున్నార్రా భాయ్ నా గురించి. నాకేమంత ఖర్మ పట్టలేదు. నా సమస్యలను నేనే పరిష్కరించుకోగలను అంటోంది సమంత. వేరే వాళ్ళ నుంచి ఆర్ధిక సాయం తీసుకునేంత దీనస్థితిలో లేను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి...తనకు వచ్చిన మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటోంది. దీని కోసం ఆమెకు ఓ స్టార్ హీరో 25 కోట్లు సాయం చేశారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల మీదనే సమంత స్పందించింది. సోషల్ మీడియాలో కొంచెం గట్టిగానే సమాధానం చెప్పింది. మయోసైటిస్ చికిత్స కోసం అంత డబ్బులు అవుతాయని ఎవరు చెప్పారు. మీరు చెప్పిన దాని కంటే అతి తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నాను అంటూ రాసుకొచ్చింది.

నా ఖర్చులు నేనే పెట్టుకోగలను. ఇన్నాళ్ళ నా కెరీర్ లో ఇప్పటివరకు వర్క్ చేసినందుకు జీతంగా రాళ్ళూ రప్పలూ ఇవ్వలేదనే అనుకుంటున్నాను. కాబట్టి నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను అంటూ కొట్టీకొట్టనట్టుగా పోస్ట్ పెట్టిందీ ఓహ్ బేబి. మయోసైటిస్ కారణంగా చాలా మంది బాధపడుతున్నారు. ట్రీట్ మెంట్ కు సంబంధించి సమాచారాన్ని ఇచ్చే ముందు బాధ్యతగా ఉండండి. ఏది పడితే అది రాయొద్దు అని చెప్పుకొచ్చింది.

యశోద ప్రమోషన్స్ టైమ్ లో సమంత కు మయోసైటిస్ ఉందని తెలిసింది. అప్పుడు ఆమె దానికోసం చికిత్స తీసుకుంది. తరువాత మళ్ళీ సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ మయోసైటిస్ కు ట్రీట్ మెంట్ అవసరం, అందుకే సినిమాలకు ఓ ఏడాది పాటూ బ్రేక్ ఇస్తున్నా అంటూ విదేశాలకు వెళ్ళింది సమంత.





Updated : 5 Aug 2023 1:45 PM IST
Tags:    
Next Story
Share it
Top