కడుపొచ్చాకే పెళ్లి చేసుకుంటా.. తాప్సీ పన్ను హాట్ కామెంట్...
X
తాప్సీ పన్నుకు నోరు ఎక్కువ అని అందరికీ తెలిసిందే. తన కెరీర్‌కు సాయపడిన దక్షిణాది ఇండస్ట్రీని తిట్టిపోసినా, ఎవరేమనుకుంటారన్న భయం లేకుండా మనసులో ఉన్నది పచ్చిగా బయటిపెట్టినా ఆమెకే చెల్లింది. అందంలోనూ, నటనలోనూ ఎవరికీ తీసిసోని ఈ ముద్దుగుమ్మ తరచూ తోటి తారలపై బుస్సుమని పడగ విప్పుతుంటుంది. తాజాగా కొందరు హీరోయిన్లను కెలికి వార్తలకెక్కింది. వారి పేర్లను నేరుగా ప్రస్తావించకుండా అనాల్సింది అనేసింది.
తమ సినిమాలు థియేటర్లలో లేకపోతే జనం తమను మరిచిపోతారని చాలామంది తారలు సోషల్ మీడియాలో చేసే చాటింగే తాప్సీ కూడా చేస్తుంటుంది. ఎవరో అడగకూడని ప్రశ్నలు అడగడానికి , తాము ఇవ్వకూడని సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలవడానికి ఇది చక్కని వేదిక. తాప్సీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా అలాంటి చాటింగ్ చేసింది. ‘హామ్ మేడమ్, తిన్నావా, పడుకున్నావా’ వంటి సోది ప్రశ్నలు అడగకుండా మాంచి మసాలా ప్రశ్నలు అడగాలని షరతు పెట్టింది. మరిక జనం ఊరుకుంటారా? ఓ అభిమాని రొటీన్ ప్రశ్నే అడుగుతూ ‘‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటావ్?’’ అని సూటిగా అడిగారు. దాని పన్నూ పాప, ‘‘నేనింకా గర్భం దాల్చలేదు కాబట్టి నా పెళ్లి ఇప్పట్లో లేకపోవచ్చు’’ అని అంది. దీంతో అభిమాన్స్ జట్టు పీక్కున్నారు. ఆమె కొంతమంది హీరోయిన్ల గురించే ఆ మాట అన్నట్లు అర్థం చేసుకుని నవ్వుకున్నారు. అలియా భట్, ఇలియానా డిక్రూజ్, నేహా ధూపియా, దియా మీర్జా, సెలీనా జైట్లీ, శ్రీదేవి వంటి పాత కొత్త తారలు పెళ్లి కాకుండానే తల్లులైన సంగతి తెలిసిందే. ఇలియానా రేపోమాపో డెలివరీ కానుంది. తన ప్రియుడంటూ ఓ వ్యక్తిని పరిచయం చేసిన ఇల్లీ పిల్ల అని పేరు ఊరేమిటో చెప్పకుండా ఉత్కంఠ పెంచింది. డెలివరీ అయ్యాక బిడ్డపేరూ, అతని పేరు రెండూ ఒకటేసారి బయటపెడుతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు.