Home > సినిమా > షారూఖ్ ను వెనక్కి నెట్టేసిన మిల్కీబ్యూటీ

షారూఖ్ ను వెనక్కి నెట్టేసిన మిల్కీబ్యూటీ

షారూఖ్ ను వెనక్కి నెట్టేసిన మిల్కీబ్యూటీ
X

ప్రస్తుతం తమన్నా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఆమె చేసిన రెండు వెబ్ సీరీస్ లతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. మరోవైపు రజనీకాంత్ జైలర్ సినిమాలో పాటలతో పాపులర్ గా నిలిచింది. వీటన్నింటికంటే సెన్సేషనల్ న్యూస్ మరొకటి ఉంది. బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ వెనక్కి నెట్టేసి మరీ మొదటి ప్లేస్ లో నలిచింది తమన్నా. ఎక్కడ, ఏమిటో, ఎలాగో తెలుసా...

తమన్నా పెద్ద పెద్ద స్టార్లతో నటిస్తోంది ప్రస్తుతం. రజీకాంత్ తో జైలర్ చిత్రం చేసింది. అది ఆల్రెడీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మరోవైపు చిరంజీవితో భోళా శంకర్ లోనూ నటిస్తోంది. దీంతో పాటూ తన పాపులారిటీతో మోస్ట్ ఫైవరెట్ సెలబ్రిటీల లిస్ట్ లో నంబర్ వన్ గా కూడా నిలిచింది. తాజాగా IMDB ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఇప్పటివరకు బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ మొదటి స్థానంలో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆయన్ను వెనక్కి నెట్టేసి మరీ తమన్నా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

భారతీయులు అత్యంతగా ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారు అని సర్వే చేసి IMDB ఈ లిస్ట్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువ మంది భారతీయులు తమన్నా అంటే పడిచచ్చిపోతున్నారుట. అందుకే షారూఖ్ ఖాస్ కూడా ఒకడుగు వెనక్కి వెళ్ళిపోయాడు. రెండవస్థానంలో సరిపెట్టుకున్నాడు. తర్వాతి స్థానాల్లో మృణాల్ ఠాకూర్, కియారా అద్వాని, రామ్ చరణ్, రణవీర్ సింగ్, దళపతి విజయ్ లు ఉన్నారు. రామ్ చరణ్, విజయ్ లాంటి వాళ్ళు తమన్నా కంటే పెద్ద స్టార్లు. కానీ వీళ్ళందరినీ మిల్కీబ్యూటీ తోసిరాజనేసింది.

పాలకంటే తెల్లని తెలుపుతో మెరిసే పోయే తమన్నా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. చాలా చిన్నగా కెరీర్ ని స్టార్ట్ చేసిన తమన్నా హ్యాపీ డేస్ తో హీరోయిన్ గా స్థిరపడింది. తెలుగు తర్వాత తమన్నా తమిళం, హిందీ సినిమాల్లో కూడా పాపులారిటీ సంపాదించుకుంది. అన్నింటి కంటే ముఖ్యంగా ఆమె డాన్స్ అంటే సినిమా అభిమానులు పడి చచ్చిపోతారు. హీరోయిన్లలో బెస్ట్ డాన్సర్ అనిపించుకుంది. తమన్నా డాన్స్ చేస్తే చూడ్డానికి రెండు కళ్ళూ చాలవు అంటారు ఆమె అభిమానులు.





Updated : 13 July 2023 9:59 AM IST
Tags:    
Next Story
Share it
Top