Home > సినిమా > మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ విడుదల...

మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ విడుదల...

మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ విడుదల...
X

రొటీన్ సినిమాలకు భిన్నంగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మైక్ మూవీస్ తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. బిగ్‌బాస్ ఫేమ్ సొహెల్ హీరోగా న‌టించిన‌ ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ మూవీలోని ‘‘హే చెలీ’ పాట ప్రోమోను విడుదల చేశారు. ‘హే చెలీ అడిగానే కౌగిలీ.. తీయగా తీరాలి ఈ చలీ.. హే సఖీ విరహాలు దేనికీ.. చేరవా అడుగేసి చెంతకీ.. ’’ అంటూ అద్భుతంగా సాగుతుందీ పాట. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, లలిత కావ్య పాడారు.

ఆకట్టుకునే ప్రేమభావాలతో, చక్కని సంగీతం, అభినయంతో ఈ పాటను తెరకెక్కించారు. శ్రీమణి రాసిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. పూర్తిపాటను రేపు(మంగళవారం) విడుదల చేయనున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపరెడ్డి అప్పిరెడ్డి, వెంకట్ అప్పిరెడ్డి రవిరెడ్డి సజ్జల, నిర్మించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రూపా కొడవాయుర్ నటించనుండగా... సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదల కానుంది. మైక్ టీవీ బ్యానర్‌పై రూపొందిన ‘‘స్లమ్ డాగ్ హస్సెండ్’’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇదే బ్యానర్‌పై నిర్మించిన మరో చిత్రం ‘మట్టికథ’ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 25 July 2023 6:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top