Home > సినిమా > మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ రేపే విడుదల...

మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ రేపే విడుదల...

మిస్టర్ ప్రెగ్నెంట్ ‘హే చెలీ’ సాంగ్ రేపే విడుదల...
X

రొటీన్ సినిమాలకు భిన్నంగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న మైక్ మూవీస్ తాజా చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. బిగ్ బాస్ షోతో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకుని సోహెల్, రూపా కొడవాయుర్ హీరోహీరోయిన్లు. ఆసక్తి రేపే కథతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ మూవీలోని ‘‘హే చెలీ’ పాట ప్రోమోను విడుదల చేశారు.

‘హే చెలీ అడిగానే కౌగిలీ

తీయగా తీరాలి ఈ చలీ

హే సఖీ విరహాలు దేనికీ

చేరవా అడుగేసి చెంతకీ.. ’’

అంటూ అద్భుతంగా సాగుతుందీ పాట. ఆకట్టుకుని ప్రేమభావాలతో, చక్కని సంగీతం, అభినయంతో ఈ పాటను తెరకెక్కించారు. శ్రీమణి రాసిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. పూర్తిపాటను రేపు(మంగళవారం) విడుదల చేయనున్నారు. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అన్నపరెడ్డి అప్పిరెడ్డి, వెంకట్ అప్పిరెడ్డి రవిరెడ్డి సజ్జల, నిర్మించారు. సుహాసిని, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 18న థియేటర్లలో విడుదల కానుంది. మైక్ టీవీ బ్యానర్‌పై రూపొందిన ‘‘స్లమ్ డాగ్ హస్సెండ్’’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇదే బ్యానర్‌పై నిర్మించిన మరో చిత్రం ‘మట్టికథ’ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 24 July 2023 7:06 PM IST
Tags:    
Next Story
Share it
Top