హీరో నవదీప్‌కు షాక్.. పిటిషన్ కొట్టేసిన హైకోర్ట్
X
టాలీవుడ్ హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్‌కు బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. విచారణకు హాజరుకావాలని నవదీప్‌కు కోర్టు స్పష్టం చేసింది. కాగా, మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను పోలీసులు ఏ29గా పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణ హైకోర్టును నవదీప్ ఆశ్రయించాడు. ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ కోర్టులో పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సెప్టెంబర్ 19వ తేదీ వరకు నవదీప్‌ను అరెస్టు చేయొద్దని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో ఇవాళ నవదీప్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ను 29వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. మాదాపూర్ ప్రెష్ లివింగ్ అపార్ట్మెంట్ లో జరిగిన డ్రగ్స్ పార్టీలో హీరో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను నవదీప్ తోసిపుచ్చుతున్నారు. డ్రగ్స్ కేసు ఎప్పుడూ తెరమీదికి వచ్చినా తన పేరును చేర్చుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. హీరో నవదీప్ పరారీలో ఉన్నట్టుగా స్యయంగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని హీరో నవదీప్ ప్రకటించారు. వెంటనే ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువు తీరడంతో నిన్న నవదీప్ నివాసంలో నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. దీంతో మరో పిటిషన్ ను దాఖలు చేశారు హీరో నవదీప్. ఈ పిటిషన్ ను విచారణను ఇవాళ ముగించింది హైకోర్టు. నోటీసులిచ్చి నవదీప్ ను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.