అందుకే ఆమె గొంతు పట్టుకున్నా-చిరంజీవి
X
చిరంజీవి నటించిన భోళాశంకర్ మరికొన్ని రోజుల్లో విడుదల అవబోతోంది. దీని ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరగింది. అయితే అంతకు ముందు చిరు లీక్స్ అంటూ మెగాస్టార్ అప్పుడప్పుడూ సినిమాకు సంబంధించిన వార్తలు, వీడియోలు పోస్ట్ చేస్తూ వచ్చారు. ఇందులో ఒకచోట చిరంజీవి కీర్తి సురేష్ పీకపట్టుకున్నట్టు కనిపించింది. అది సరదాకే అని తెలుస్తున్నా....ఎందుకు అలా చేశారంటూ అభిమానులు ఆసక్తి చూపించారు. దీనికి చిరంజీవి రీసెంట్ గా సమాధానం చెప్పారు. అందుకే కీర్తి మెడను పట్టుకున్నా అంటూ ఆ సరదా సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.
భోళాశంకర్ సినిమాలో చిరు టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా, కీర్తి సురేష్ చెల్లెలుగా చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. చిరు లీక్స్ లో ఓ సాంగ్ వీడియో గ్లింప్స్ ను పెట్టారు మెగాస్టార్. అందులోనే కీర్తి మెడను పట్టుకున్నట్టు కనిపించింది. అలా ఎందుకు చేశారంటే...షూటింగ్ స్పాట్లో ఇచ్చే ఫుడ్ కీర్తికి అంత నచ్చలేదుట. అప్పుడు చిరంజీవ తన ఇంట్లో తమిళ కుక్ ఉన్నాడని నీకు ఏది కావాలన్నా ఇంటి నుంచి తెప్పిస్తానని చెప్పారుట. అప్పటి నుంచీ ఆయన ఇంటి నుంచి కీర్తికి క్యారేజీ వచ్చేది. ఆమె కూడా ఏమీ మొహమాటపడకుండా బోలెడు వెరైటీలు చేయించుకుని తినేదిట. తినేది తక్కువే అయినా అన్నీ శుభ్రంగా తినేదిట.
ఒకరోజు చిరు ఏదో పనిలో ఉండగా...ఏదో అర్జంటు పని ఉన్నట్టు డిస్టర్బ్ చేసి...ఈరోజు ఇంట్లో నుంచి ఏం పుడ్ వస్తోంది అని చిరుని అడిగిందట కీర్తి. ఆమె ప్రశ్నలకు విసిగిన ఆయన సరదాగా నిన్ను చంపేస్తా అంటూ గొంతు పట్టుకున్నా అని చెప్పుకొచ్చారు మెగాస్టార్. భోజనంలో ఏది తక్కువైనా అస్సలు మొహమాటపడకుండా అడుగుతంది, మా ఇంట్లో సభ్యులుగా కలిసిపోయింది అన్నారు.