Christian Oliver : ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు కుమార్తెలు సహా నటుడి దుర్మరణం
X
హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్, అతని ఇద్దరు కూతుళ్లు విమాన ప్రమాదంలో మరణించారు. వారు ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దసేపటికే కరీబియన్ సముద్రంలో కుప్పకూలింది. కోస్ట్ గార్డ్ ఘటనా స్థలం నుంచి వీరి మృతదేహాలను వెలికితీసింది.
జర్మనీలో జన్మించిన క్రిస్టియన్ ఒలివర్ (51)కు ఇద్దరు కుమార్తెలు. అన్నిక్ (12), మదితా (10)తో కలిసి.. వాళ్ల ప్రైవేట్ విమానంలో బెక్వియా నుంచి సెయింట్ లూసియాకు బయళ్దేరారు. ఈ సమయంలో గురువారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒలివర్ జర్మనీతో పాటు.. పలు టీవీ సీరీసుల్లో నటించాడు. కోబ్రా 11 సిరీస్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘ది గుడ్ జర్మన్’, ‘స్పీడ్ రేసర్’ సహా మొత్తం 60 సినిమాల్లో నటించాడు.
షాకింగ్ లైవ్ వీడియో..
— Telugu Scribe (@TeluguScribe) January 6, 2024
ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ ప్రయాణించిన ఛార్టర్డ్ ప్లయిట్ కూలిపోయి సముద్రంలో పడతున్న దృశ్యాలు.. https://t.co/e8mUnEaBVy pic.twitter.com/RzvMcgSVUv