జూ.ఎన్టీఆర్ మామూలోడు కాదు..హాలీవుడ్ నటినే దించేస్తున్నాడుగా..
X
వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న తన 30వ ప్రాజెక్ట్ దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది పూర్తికాగానే క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో మూవీ పట్టాలకెక్కనుంది. ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ వస్తోంది. ఫ్యాన్స్ దృష్టిని ఆకట్టుకుంటోంది. తాజాగా వచ్చిన మరో అప్డేట్ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది. ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్గా గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా నటించనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం ఆమెను కాంటాక్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారడంతో జూనియర్ క్రేజ్ మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ తీసుకువచ్చిన ఇమేజ్ దృష్టిలో ఉంచుకుని కథలను, డైరెక్టర్లను, హీరోయిన్లలను చాలా కేర్‌ఫుల్‌గా ఎన్నుకుంటున్నాడు ఎన్టీఆర్. అందుకే కొరటాలతో దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం దేవర కోసం బాలీవుడ్ బ్యూటీ జాన్వీని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో వచ్చే ఏడాది చిత్రీకరణ మొదలు కానున్న ప్రశాంత్ సినిమా కోసం ప్రియాంక చోప్రాను హీరోయిన్గా సెలక్ట్ చేసుకోబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ఇప్పటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా మించి గుర్తింపు ఉంది. ఏ ఇండియన్ నటికి రాని విధంగా హాలీవుడ్ సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ తన టాలెంట్‌తో అక్కడివారిని ఫిదా చేస్తోంది. రీసెంట్గా ఈ భామ చేసిన సీటీడెల్ వెబ్ సిరీస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న ప్రియాంకను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని భావిస్తున్నారు. కేజీఎఫ్‌తో ప్రశాంత్‌కు, ఆర్ఆర్ఆర్తో జూనియర్ ఎన్టీఆర్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రేజ్ వచ్చింది. ఈ టీమ్‌లో ప్రియాంక కూడా జోడు కడితే ఇక సినిమాకు తిరుగుండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించనున్నారు. ఇండియా - పాక్ బోర్డర్ నేపథ్యంలో సాగే కథతో ముందుకు వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది.