Home > సినిమా > Bigg Boss7: యావర్ ముందు చూపు.. ప్రియాంక, అర్జున్ ఎంత సంపాదించారంటే..?

Bigg Boss7: యావర్ ముందు చూపు.. ప్రియాంక, అర్జున్ ఎంత సంపాదించారంటే..?

Bigg Boss7: యావర్ ముందు చూపు.. ప్రియాంక, అర్జున్ ఎంత సంపాదించారంటే..?

Bigg Boss7: యావర్ ముందు చూపు.. ప్రియాంక, అర్జున్ ఎంత సంపాదించారంటే..?
X

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. 15 వారాల పాటు హౌస్ లో అలరించిన కంటెస్టెంట్స్.. చివరికి ఆరుగురు మిగిలారు. ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అర్జున్, అమర్ లు ఫైనల్స్ లోకి అడుగుపెట్టారు. కాగా ఫైనల్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన మొదటి కంటెస్టెంగా ప్రియాంక నిలిచింది. ఎలాంటి అంచనాల్లేకుండా ఎంట్రీ ఇచ్చిన ఈ సీరియల్ నటి.. చివరి వరకు వచ్చి టఫ్ ఫైట్ ఇచ్చింది. రెండు వారాల తర్వాత మధ్యలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన అర్జున్ కూడా గట్టి పోటీ ఇచ్చి ఫైనల్స్ కు చేరుకున్నాడు. జనాదరణ పొందడంలో వెనకబడిన ప్రియాంక.. తన ఆటతో ఫైనల్స్ వరకు తన జర్నీని కొనసాగించింది. కాగా ప్రియాంక వారానికి రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ మాట్లాడుకుందట. అంటే మొత్తంగా రూ.37.5 లక్షలు ఈమె సంపాదించినట్లు తెలుస్తోంది.

అటు అర్జున్ కూడా గట్టిగానే సంపాదించాడు. అర్జున్ వారానికి రూ.3,50,000 తీసుకున్నాడట. ఈ లెక్కన 10 వారాలకుగానూ అర్జున్‌ రూ.35,00,000 వెనకేసుకున్నాడు. లేటుగా హౌస్‌లోకి వచ్చినప్పటికీ చాలామందికంటే ఎక్కువగానే సంపాదించాడు అర్జున్‌. ప్రతిసారి నామినేషన్స్ లోకి వచ్చిన అటు యావర్ కూడా రూ.15లక్షలు తీసుకుని బయటకొచ్చేశారు. బిగ్ బాస్ రూ.15 లక్షలు ఆఫర్ చేయగా.. టాప్ 4లో నిలిచిన యావర్ ఆ డబ్బును తీసుకుని హస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కాగా టాప్ 3లో ప్రశాంత్, శివాజీ, అమర్ ఉన్నారు. కంటెస్టెంట్స్ సంపాదించిన అమౌంట్ లో సగం వరకు ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి ఉంటుంది.

Updated : 17 Dec 2023 10:04 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top