Home > సినిమా > చిరంజీవి సెటైర్ దిల్ రాజు పైనేనా

చిరంజీవి సెటైర్ దిల్ రాజు పైనేనా

చిరంజీవి సెటైర్ దిల్ రాజు పైనేనా
X

చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ప్రస్తుతం టాప్ డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు లీలలు వేరే ఉంటాయి. ఒకవేళ తనది చిన్న సినిమా అయితే పెద్దవాళ్లను ఆగమంటాడు. తనది పెద్ద సినిమా అయితే చిన్నవాళ్లను ఇబ్బంది పెడతాడు. ఇది టాలీవుడ్ ఎరిగిన సత్యం. కొన్నాళ్లుగా ఆయన హను మాన్ సినిమాను వాయిదా వేయించాలని విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ కుదర్లేదు. దీంతో ఆ సినిమాకు థియేటర్స్ దొరక్కుండా టార్గెట్ చేశాడు. హైదరాబాద్ లో 95కు పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండగా.. వీటిలో 90 థియేటర్స్ ను తనే బ్లాక్ చేశాడు. ఎందుకంటే హను మాన్ వస్తోన్న జనవరి 12నే గుంటూరు కారం కూడా విడుదలవుతోంది కాబట్టి. గుంటూరు కారంను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది దిల్ రాజు కాబట్టే ఇలా చేశాడు. ఎంత వ్యాపారమే అయినా ఓ రకంగా ఇది అంతకు మించిన పాపం కూడా. అయినా డబ్బులు మాత్రమే ఫైనల్ అనుకునే దిల్ రాజు హను మాన్ నిర్మాతను కనికరించలేదు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి హాజరయ్యాడు. ఆయనను ఇండస్ట్రీ పెద్దగా కొందరు భావిస్తున్నారు కాబట్టి ఈ విషయం అక్కడి వరకూ వెళ్లిందట. కానీ తనేం చేయలేకపోయాడు. అందుకే.. ‘ఇది పరీక్షా కాలం అనుకోవచ్చు. కొన్నిసార్లు అనుకున్నన్ని థియేటర్స్ దొరక్కపోవచ్చు. అయినా కంటెంట్ లో దమ్ముంటే మొదటి రోజు కాకపోతే రెండో రోజు, రెండో రోజు కాకపోతే సెకండ్, థర్డ్ షో చూస్తారు..’ అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయినా హను మాన్ లో బలమైన కంటెంట్ ఉంది. గుంటూరు కారం అలా కనిపించడం లేదు.. కాబట్టి దిల్ రాజు ఎక్కువ రోజులు థియేటర్స్ ను హోల్డ్ చేయలేడు అనే ఇన్ డైరెక్ట్ సెటైర్ ఈ మాటల్లో ఉందంటున్నారు కొందరు. ఏదేమైనా చిరంజీవి కూడా దిల్ రాజు ఆపలేకపోయాడు. అది అతని రేంజ్ అనుకోవాలా లేక బరితెగింపు అనుకోవాలా అనేది ఆళ్లే తేల్చుకుంటారు. మనల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు.

Updated : 8 Jan 2024 1:32 PM IST
Tags:    
Next Story
Share it
Top