Home > సినిమా > Hrithik Roshan : స్టార్ హీరోకు గాయం.. షూటింగ్ వాయిదా

Hrithik Roshan : స్టార్ హీరోకు గాయం.. షూటింగ్ వాయిదా

Hrithik Roshan : స్టార్ హీరోకు గాయం.. షూటింగ్ వాయిదా
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. నడుముకు బెల్ట్ పెట్టుకుని క్రచెస్ సాయంతో ఆయన నిల్చుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ నోట్‌ను కూడా రాసుకొచ్చారు. ఎంత మందికి క్రచెస్, వీల్ ఛైర్ అవసరమొచ్చింది? అప్పుడు వారి ఫీలింగ్ ఏంటి? అంటూ తన పోస్ట్‌లో ఆయన రాసుకొచ్చారు.

గాయం అయిన తర్వాత తనను తాను మోటివేట్ చేసుకుంటున్నానని హృతిక్ తెలిపారు. బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాలికి గాయం అవ్వడం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. హృతిక్ రోషన్‌కు గాయం అవ్వడం పట్ల టైగర్ షరాఫ్, వరుణ్ ధావన్, వాణీ కపూర్‌లు స్పందించారు. త్వరగా హృతిక్ కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.

మరోవైపు హృతిక్ రోషన్ కాలికి గాయం అవ్వడం వల్ల వార్-2 మూవీ షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయాన్ ముఖర్జీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ టాప్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. వచ్చే ఏదాడి ఈ మూవీని థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Updated : 15 Feb 2024 8:58 AM IST
Tags:    
Next Story
Share it
Top