Home > సినిమా > Hyderabad Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ సినీ ప్రముఖులు

Hyderabad Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ.. పట్టుబడ్డ సినీ ప్రముఖులు

Hyderabad Rave Party : హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ..  పట్టుబడ్డ సినీ ప్రముఖులు
X

హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఇబ్రహీంపట్నంలో ఫామ్‌హౌజ్‌పై దాడులు నిర్వహించిన పోలీసులు.. 11 మంది సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలను పోలీసుల అదుపులో తీసుకున్నారు. బిగ్‌బాస్ ఫేమ్ హిమజ ఆధ్వర్యంలో ఈ రేవ్ పార్టీ జరిగినట్లు సమాచారం. బర్త్ డే పార్టీ పేరుతో ఫామ్ హౌస్ లో రచ్చ రచ్చ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు, బిగ్ బాస్ స్టార్లు న్యూసెన్స్ క్రియేట్ చేశారని కేసు నమోదు చేశారు. బర్త్ డే పార్టీలో విచ్చల విడిగా మద్యం తాగుతూ.. అసభ్య చేష్టలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పార్టీలో దొరికిన 15 లీటర్ల లిక్కర్ ను పోలీసులు సీజ్ చేశారు.

ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరంలో రేవ్ పార్టీలంటూ ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారు కొందరు ప్రముఖులు. మూడు నెలల క్రితం హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన మాదాపూర్‌లో సైతం ఓ రేవ్ పార్టీ జరిగిది. ఆ పార్టీలో కూడా పలువురు సినీ ప్రముఖులతో పాటు ధనవంతుల పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఓ సినీ నిర్మాతతో పాటు ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం రేవ్ పార్టీ అంశం ఇటు రాజకీయాల్లోనూ, సినీ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఓ రాజకీయ పార్టీకి ప్రచారం చేస్తున్న సినీ ప్రముఖులు కూడా ఈ రేవ్ పార్టీలో దొరికినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




Updated : 12 Nov 2023 2:17 PM IST
Tags:    
Next Story
Share it
Top