Home > ఆంధ్రప్రదేశ్ > Hyper Adi : ఎమ్మెల్యేగా పోటీచేయనున్న జబర్దస్త్ కమెడియన్!

Hyper Adi : ఎమ్మెల్యేగా పోటీచేయనున్న జబర్దస్త్ కమెడియన్!

Hyper Adi : ఎమ్మెల్యేగా పోటీచేయనున్న జబర్దస్త్ కమెడియన్!
X

జబర్దస్త్ కమెడియన్లలో విజయవంతంగా దూసుకుపోతున్నవారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. గతంలో జనసేన సభల్లో హైపర్ ఆది చాలాసార్లు ప్రసంగించారు. తన మాటలతో, ప్రసంగాలతో జనసైన్యాన్ని ఆకట్టుకున్నారు. తాజాగా ఆది తన రాజకీయ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

తనను ఇంతటివాడిని చేసింది జబర్దస్ షోనే అని హైపర్ ఆది అన్నారు. జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన వైసీపీ నాయకురాలు రోజాతో తనకు ఎటువంటి విభేదాలు లేవన్నారు. నాగబాబు లాగానే ఆమె కూడా తనను ఎంతగానో ప్రోత్సహించిందని తెలిపారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, ఆయన సిద్ధాంతాలు తనకు ఎంతో నచ్చాయని, అందుకే పవన్‌తో కలిసి నడుస్తున్నట్లు తెలిపారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించరన్నారు. సమస్యల గురించి మాత్రమే ఆయన మాట్లాడుతారని, ఆయనకు సమస్యలు చెప్పుకుంటే కచ్చితంగా ఆ సమస్యలను పరిష్కరిస్తారని హైపర్ ఆది అన్నారు. అటువంటి పవన్‌ను ఎవరైనా ఏమైనా అంటే తాను ఊరుకోనని, గట్టిగానే రియాక్ట్ అవుతానని తెలిపారు. పదవులు, టికెట్లు ఆశించి తాను జనసేనకు మద్దతు తెలుపడం లేదని, రానున్న ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని చెప్పుకొచ్చాడు. పవన్‌ను గెలిపించడానికి తాను గెలుస్తానని అన్నారు. ఈసారి కూడా జనసేన తరపున తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు.


Updated : 14 Feb 2024 11:51 AM IST
Tags:    
Next Story
Share it
Top