అలాంటి వారికే అవకాశాలు..బాలీవుడ్‌పై బాంబు పేల్చిన తాప్సీ..
X
గత కొంత కాలంగా టాలీవుడ్లో స్టార్డమ్ సంపాదించుకున్న చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్ బాట పడుతున్నారు. అలాంటి వారిలో సొట్ట బుగ్గల సుందరి తాప్సీ ఒకరు. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఢిల్లీ బ్యూటీని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేశారు. మంచు మనోజ్ హీరోగా నటించిన ఝుమ్మందినాదం మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. మొదటి సినిమాతోనే తన నటనతో , గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత రవితేజ , ప్రభాస్, గోపీచంద్ వంటి స్టార్స్ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
ఏమైందో ఏమో కానీ తాప్సీ ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి తన మకాంను బాలీవుడ్‌కు మార్చింది. బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందిపుచ్చుకుని నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో టాలీవుడ్పైన షాకింగ్ కామెంట్స్ చేసి ఫైర్ బ్రాండ్ పేరు సంపాదించుకున్న తాప్సీ లేటెస్టుగా బాలీవుడ్‌పైన ఓ బాంబు వేసింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది తాప్సీ. బాలీవుడ్లో ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమాలోని ఏ పాత్రకు ఎవరిని తీసుకోవాలి అనేది కొంత మంది హీరోహీరోయిన్లు డిసైడ్ చేస్తారని హాట్ కామెంట్స్ చేసింది. టాలెంట్ ఉన్నవారికి, ఆ పాత్రను చేయగలిగేవారికి ఇక్కడ అవకాశం ఉండదు. నన్ను కావాలనే పక్కన పెట్టారు . ఆ విషయం నాకు తెలుసు. ఇక్కడ అందరూ పక్షపాతంగా వ్యవహరిస్తారు. తమ ఫ్రెండ్స్‌ని, ఏజెన్సీ వాళ్లకు ప్రయారిటీ ఇస్తుంటారని చెప్పుకొచ్చింది తాప్సీ. బాలీవుడ్ లో క్యాంపులు, ఫేవరిటిజం ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ పక్షపాత ధోరణీతో సినిమా అవకాశాలు ఇప్పిస్తారని తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మధ్యనే మాజీ ప్రపంచ సుందరి, ఒకప్పటి బాలీవుడ్ నటి, నేటి హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా బాలీవుడ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. తనకు ఎదురైన చేదు అనుభవాలను చెప్పింది. ఇదే క్రమంలో ప్రియాంక ఆరోపణలకు మద్దతు ఇచ్చినట్లుగా తాప్సీ కూడా బాలీవుడ్‌పై సంచలన కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.