అల్లు అర్జున్‌కు నేను వీరాభిమానిని..స్టార్ క్రికెటర్ భార్య కామెంట్స్
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా ఫాన్ ఫాలోయింగ్ ఉంది. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. తాజాగా అల్లు అర్జున్‌కు తాను అభిమానినని, ఆయన సినిమాలన్నీచూశానని స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి చెప్పారు. ఓటీటీలు లేని రోజుల్లోనే అల్లు అర్జున్ సినిమాలన్నింటినీ చూశానని హైదరాబాద్‌లో జరిగిన LGM సినిమా మీడియా సమావేశంలో తెలిపారు. మీరు తెలుగు సినిమాలు ఏమైనా చూశారా?అని విలేఖరి అడిగిన ప్రశ్నకు గాను సాక్షి అల్లు అర్జున్ గురించి చెప్పి అందరినీ అవాక్కు చేశారు.
మీడియా సమావేశంలో సాక్షి మాట్లాడుతూ.." మీకు తెలుసా.. నేను బన్నీ సినిమాలన్నీ చూశాను. నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ లాంటి ఓటీటీలు ఏమీ అప్పట్లో లేవు. యూట్యూబ్‌లోని గోల్డ్‌మైన్ ప్రొడక్షన్ ఛానెల్‌లోనే అల్లు అర్జున్ చిత్రాలన్నీ చూశాను. దాదాపు తెలుగు సినిమాలన్నింటినీ ఈ ఛానెల్ వారు హిందీలోకి అనువాదం చేస్తారు. అందుకే అల్లు అర్జున్ నటించిన ఏ సినిమాను నేను మిస్ కాలేదు. ఆయనకు నేను బిగ్ ఫ్యాన్ ని" అని సాక్షి సింగ్ తెలిపారు.
మహేంద్ర సింగ్ ధోనీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ పేరిట తన భార్య సాక్షిని నిర్మాతను చేసి..మొదటి ప్రయత్నంగా LGM అనే తమిళ సినిమాను నిర్మించారు. హరీష్ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నదియా కాలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రమేష్ తమిళమణి దర్శకత్వం వహించారు. తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులోనూ అనువాదం చేసి త్వరలో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్.