Home > సినిమా > ఆయన చేసిన దానికి నేనే ఎక్కువ నష్టపోయా...Vishwak sen

ఆయన చేసిన దానికి నేనే ఎక్కువ నష్టపోయా...Vishwak sen

ఆయన చేసిన దానికి నేనే ఎక్కువ నష్టపోయా...Vishwak sen
X

ఫలక్ నామ దాస్ మూవీతో అచ్చమైన తెలంగాణ కుర్రాడిగా వెండితెరకు పరిచయమైయ్యాడు హీరో విశ్వక్ సేన్. తొలి చిత్రంతోనే అటు డైరెక్టర్ గా, ఇటు హీరోగా హిట్ కొట్టాడు. కొత్త కథలను ఎంచుకుంటూ తన దైన శైలిలో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటించిన గామి రిలీజ్ కు సిద్ధమైంది. ఈ చిత్రంలో అఘెరాగా విశ్వక్ కనిపించనున్నారు కాగా మార్చి 8న మూవీ విడుదల కానుంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం కూడా కొద్ది గ్యాప్‌లోనే విడుదల కానుంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఒకరు చేసిన పనివల్ల తాను చాలా నష్టపోయానని చెప్పారు.

ప్రముఖ నటుడు అర్జున్‌ దర్శకత్వంలో విశ్వక్ సేన్ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి అప్పట్లో అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి విశ్వక్‌సేన్‌ కమిట్‌మెంట్‌ లేని నటుడు అంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆ న్యూస్ టాలీవుడ్‌లో బాగా వైరల్ అయ్యింది. కాని ఈ వ్యాఖ్యాలపై విశ్వక్‌ పెద్దగా రెస్పాండ్‌ కాలేదు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్‌ వ్యాఖ్యలపై విశ్వక్‌ క్లారిటీ ఇచ్చాడు. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న హీరోకి ఇలానే జరిగితే ఏమయ్యేది..? అని ప్రశ్నించారు. సినిమాని క్యాన్సిల్‌ చేయమని తానేప్పుడూ చెప్పలేదన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కరోజు షూటింగ్‌ మాత్రమే ఆపమని కోరినట్లు స్పష్టం చేశారు. తనకు సినిమా నేపథ్యం లేదనో, మరేదో కావచ్చు అనుకుని ప్రెస్ మీట్ పెట్టారని అన్నారు. కానీ ఆయన మీద గౌరవంతో దానిని మళ్లీ సాగదీయాలనుకోలేదని తెలిపారు. ఈ విషయంపై సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. అంతేగాక ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాను తీసుకున్న రెమ్యునరేషన్‌కు రెట్టింపు తిరిగిచ్చేశానని తెలిపారు. తనపై కోపంతో ఆయన చేసిన దానివల్ల ఎక్కువ నష్టపోయింది తానేనని అని విశ్వక్‌ అన్నారు.

ఇక, హీరోగా మరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్న విశ్వక్‌.. ఇటు నిర్మాతగా కూడా ఒక సినిమా తీస్తున్నారు. కొత్త డైరెక్టర్ విద్యాధర్‌ తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్‌ సుమారు నాలుగేళ్ల పాటు జరిగింది. ఎంతో కష్టపడి చిత్రాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు.





Updated : 20 Feb 2024 9:02 AM IST
Tags:    
Next Story
Share it
Top