Home > సినిమా > Chandramukhi 2 : నేనే అసలైన చంద్రముఖిని కంగనా సంచలన కామెంట్స్

Chandramukhi 2 : నేనే అసలైన చంద్రముఖిని కంగనా సంచలన కామెంట్స్

Chandramukhi 2 : నేనే అసలైన చంద్రముఖిని కంగనా సంచలన కామెంట్స్
X

కోలీవుడ్ ఫేమస్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్, పి. వాసు డైరెక్షన్‎లో చంద్రముఖి-2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీ రోల్ అయిన చంద్రముఖి పాత్రలో ఈసారి కంగనా కనిపించబోతోంది. రజినీకాంత్ హీరోగా జ్యోతిక చంద్రముఖిగా నటించిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలుసు. దీంతో ఈ మూవీ సీక్వెల్‎గా చంద్రముఖి2ను తెరకెక్కిస్తున్నారు వాసు. సెప్టెంబర్ 15న సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. చంద్రముఖిగా ఈ సినిమాలో మునుపెన్నడూ కనిపించని విధంగా కంగనా ఎంతో అందంగా కనిపించబోతోంది. మరి చంద్రముఖిగా కంగనా ఎలా మెప్పిస్తుందనేది సినిమా విడుదల అయ్యాకే తెలుస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి తన నోటికి పనిపెట్టింది. తాజాగా జరిగిన చంద్రముఖి 2 ప్రమోషనల్ ఈవెంట్‎లో ఆమె చేసిన కామెంట్స్ మరోసారి నెట్టింట్లో దుమారం రేపుతున్నాయి. నేనే అసలైన చంద్రముఖిని అంటూ ఆమె చేసిన కామెంట్స్





వైలర్ అవుతున్నాయి.

చెన్నైలో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్లో కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. " తమిళంలో నేను నటిస్తున్న నా మూడో చిత్రం చంద్రముఖి– 2. ఈ మూవీ నాకు కొత్త అనుభూతిని అందిస్తోంది. నేను చంద్రముఖి సినిమా చూశాను. ఆ మూవీలో జ్యోతిక పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. నిజానికి చంద్రముఖి– 2 చేయడంలో జ్యోతిక నాకు స్ఫూర్తిగా నిలిచారు. అయితే జ్యోతికతో మాత్రం నన్ను కంపేర్ చేయకండి. ఎందుకంటే నేను అసలైన చంద్రముఖిని. డైరెక్టర్ వాసు నా పాత్రను ఎంతో ఆసక్తికరంగా డిజైన్ చేశారు. హారర్, కామెడీ, ఫ్యామిలీ అంశాలతో వస్తున్న ఈ ఫిల్మ్‎లో నటించడం చాలా ఆనందంగా ఉంది"అంటూ కంగనా చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో జ్యోతికపై కంగన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా‎లో వైరల్ అవుతున్నాయి. జ్యోతిక ఫ్యాన్స్ కంగనాను ట్రోల్ చేస్తున్నారు.








Updated : 6 Sept 2023 1:02 PM IST
Tags:    
Next Story
Share it
Top