నాకు రాజకీయాలు తెలియవు..బాలకృష్ణ
X
టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తనకు రాజకీయాలు తెలియవని ఆయన తెలియవని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణ ఎమ్మెల్యే డా. రసమయి బాలకిషన్ నిర్మించిన జగపతిబాబు నటించిన రుద్రంగి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వచ్చిన బాలయ్యబాబు ఇండస్ట్రీ గురించి , రసమయి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో బాలయ్య బాబు మాట్లాడుతూ.."రసమయి బాలకిషన్ నా తమ్ముడి లాంటి వాడు. నిజంగా మా ఇద్దరికీ పెద్దగా రాజకీయాలు తెలియవు. రసమయిని తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా నియమించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ నా తరఫున శుభాకాంక్షలు.
రుద్రంగి ఓ అరుదైన చిత్రం. కథ, పాత్రలు అన్నీ కూడా ప్రేక్షకులు లీనమయ్యేలా చేస్తుంది. ఇప్పటి వరకు తన కోసమే ప్రేక్షకులు థియేటర్లకి వచ్చేలా జగపతి బాబు చాలా సినిమాలు చేశారు. ‘లెజెండ్’, ‘రంగస్థలం’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ అమోఘం. తన వరకు వచ్చిన అన్ని పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారా అన్నట్లు నటిస్తారు. అలా క్యారెక్టర్లలో జీవిండచం చాలా గొప్ప విషయం. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే మా జగపతి బాబు గొప్ప నటుడు. ఒకప్పటి ఇండస్ట్రీకి ఇప్పటికీ చాలా మార్పులు జరిగాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ మనుగడ కోసం మేమంతా పనిచేస్తున్నాం. సినీ ఇండస్ట్రీ బాగుండాలనేదే మా తపన. చిన్నా, పెద్దా అన్ని సినిమాలు సక్సస్ సాధించాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు మాకోసం థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తున్నారంటే కారణం రచయితలు, దర్శకులు, నిర్మాతలు. వారి వల్లే సినీ ఇండస్ట్రీ బతుకుతుంది’’ అని బాలకృష్ణ తెలిపారు.
Krishna
సట్టి కృష్ణ.. Mic Tv websiteలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఈయనకు జర్నలిజంలో 8 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో V6 News, CVR news,Mojo Tv, 6TV వంటి పలు ఛానళ్లలో పనిచేశారు. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమా, అనాలిసిస్లు రాయగలరు.