Home > సినిమా > నాకు ఆ అలవాటు ఉంది..మానాలనుకుంటున్నాను..మహేష్ బాబు

నాకు ఆ అలవాటు ఉంది..మానాలనుకుంటున్నాను..మహేష్ బాబు

నాకు ఆ అలవాటు ఉంది..మానాలనుకుంటున్నాను..మహేష్ బాబు
X

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు..కాదు..కాదు..అర్థరాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి లైఫ్‎లో స్పేస్‎ను మొబైల్ ఫోన్స్ ఆక్రమిస్తున్నాయి. మానవ సంబంధాలను పక్కన పెట్టి ఈ మెటల్ వస్తువుకు ప్రజలు ఇస్తున్న ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఫోన్ లేకపోతే క్షణం కూడా గడవదు అన్నట్లుగా నిత్యం వాటికే గంటలతరబడి అతుక్కుపోతున్నారు. చిన్నా పెద్దా అన్న తేడా లేదు ఈ మొబైల్ ఫోన్స్‎కు అందరూ బానిసలవుతున్నారు. సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. అందరిలాగే తాను ఎక్కువగా ఫోన్‎కిఎడిక్ట్ అయ్యానని తలనొప్పిగా అనిపించినప్పుడల్లా మొబైల్ వాడకాన్ని తగ్గించడానికి తెగ ప్రయత్నిస్తుంటానని సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తాజాగా తెలిపారు. హైదరాబాద్‎లో జరిగిన ఓ ఈవెంట్‎లో మహేష్ మీడియాతో ఈ విషయాలను పంచుకున్నారు.

నాలెడ్జ్‌ సిటీలోని హోటల్‌లో ఓ కార్యక్రమంలో మీడియాతో మహేష్ మాట్లాడుతూ..."మీలాగే నేనూ ఫోన్‌ ఎక్కువగా వినియోగిస్తాను. అప్పుడప్పుడు హెడ్ ఏక్ వచ్చినప్పుడు ఫోన్ వాడకాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాను. రాత్రి పడుకునేటప్పుడు, ఉదయం లేవగానే ముందుగా మొబైల్ చూడడం నాకూ మీలాగే ఆ అలవాటు ఉంది. ఈవినింగ్ 6.30గంటలు దాటిన తరువాత మాగ్జిమమ్ దానికి దూరంగా ఉండేందుకు ట్రై చేస్తాను. వీలైనంత వరకు నా గాడ్జెట్స్‌ మా ఆవిడ నమ్రతనే తీసుకొస్తుంది. ఇక గౌతం పుట్టినప్పటి నుంచి సేవా కార్యక్రమాలను చేస్తున్నాము. సితార ఓ జ్యువెల్లరీ షోరూంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపించడం చాలా సంతోషంగా ఉంది. నా రీరిలీజ్‌ సినిమాలపై వచ్చే కలెక్షన్ మొత్తాన్ని చిన్నారుల సంక్షేమానికి ఎంవీ ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థకు ఇస్తున్నాము. షూటింగ్స్ లేనప్పుడు ఫ్యామిలీకి సమయాన్ని కేటాయిస్తాను. కుటుంబంతో కలిసి టూర్స్‎కు వెళ్తుంటాను. నాకు మా పిల్లలతో టైం స్పెండ్ చేయడమంటే చాలా ఇష్టం.

సెలబ్రిటీలకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. దానిని గుర్తిస్తే బాగుంటుంది"అని మహేష్ తెలిపారు.



Updated : 21 Aug 2023 2:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top