నాకు ఆరు భాషలు వచ్చు..ఫ్యాన్స్‌తో రష్మిక చిట్ చాట్
X
నేషనల్ క్రష్ రష్మికకు ఇండస్ట్రీలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ రష్మిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ బ్యూటీకి నెట్టింట్లో ఏకంగా 38 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీలు చిక్కినప్పుడల్లా ఈ బ్యూటీ తన ఫాలోవర్స్‌తో చిట్ చాట్ చేస్తుంటుంది. వారిని ఖుషీ చేసేందుకు ట్రై చేస్తుంటుంది. ఓ వైపు సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ నెటిజన్లను పలకరించడం మరిచిపోతోంది. ఆన్లైన్లో ఉన్నప్పుడు వారి అడిగే ప్రశ్నలకు ఎంతో కూల్‌గా సమాధానం కూడా ఇస్తుంటుంది.
లేటెస్టుగా ఓ సినిమా షూట్ ధ్యలో నెటిజన్లను పలకరించింది రష్మిక. వారు అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెప్పింది.
‘మీకు ఇష్టమైన ప్రదేశం ఏది..’ అని ఓ అభిమాని అడగ్గా.. ‘కర్ణాటకలోని కూర్గులో ఉన్న మా ఇల్లు అంటే ఎంతో ఇష్టం’ అని రష్మిక రిప్లై ఇచ్చింది. అదే విధంగా నెటిజన్లతో రష్మిక మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.." నేను ఆరు భాషల్లో మాట్లాడతాను. హైదరాబాద్‌లో ఉండే నా ఫ్రెండ్స్‌ను మాత్రం ‘నమస్తే.. బాగున్నారా’ అని పలకరిస్తాను. నా ప్రొఫెషన్ అంటే నాకు ఎంతో గౌరవం, ఇష్టం, దాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను. నాకు ఫుడ్స్‌లో కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే ఇష్టం".అంటూ తన పర్సనల్ విషయాలను పంచుకుంది.
ఇక మూవీస్ విషయానికి వస్తే రష్మిక ప్రస్తుతం మూడు భారీ ప్రాజెక్ట్‌లలో నటిస్తోంది. ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ‘పుష్ప2’లో శ్రీవల్లిగా త్వరలో అలరించనుంది రష్మిక. అదే విధంగా బాలీవుడ్లో సందీప్ వంగ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్‌కు జోడిగా ‘యానిమల్’ చిత్రంలో కనిపించనుంది. ఈ పాన్ ఇండియన్ సినిమాను డిసెంబర్ 1న విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు మొదటిసారిగా లేడీఓరియెంటెడ్ సినిమా ‘రెయిన్ బో’లో నటిస్తోంది.