చచ్చేవరకూ నేను చిరంజీవి ఫ్యాన్ నే -అల్లు అర్జున్
X
చిన్న సినిమాగా విడుదలై....వారం రోజులుగా తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తున్న సినిమా బేబి. ఆనందర్ దేవరకొండ, వైష్ణవి జంటగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఊహించనదానికన్నా ఎక్కువ స్పందన ఈ సినిమాకు రావడంతో మూవీ యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. అందుకే హైదరాబాద్ లో బేబి అప్రిషియేషన్ మీట్ నిర్వహించింది. దీనికి అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
బేబి సినిమా తనకు చాలా నచ్చేసిందన్నాడు ఐకాన్ స్టార్. సినిమా చూస్తున్నంతసేపూ చప్పట్లు కొడుతూనే ఉన్నాను అని చెప్పాడు. నిర్మాత ఎస్కేఎన్ తాను ఫ్రెండ్స్ అని...కట్టె కాలే వరకూ తామిద్దరమూ చిరంజీవి అభిమానులమే అని చెప్పుకొచ్చాడు. అది ఎప్పటికీ మారదని కూడా అన్నాడు. చిరంజీవి సైట్ లో ఓ డాన్స్ ఫ్లోర్ లో తాను డాన్స్ చేసేవాడిని. అక్కడే ఉన్న చిన్న గదిలో ఎస్కేఎన్ ఎన్నో ఏళ్ళు ఉండేవాడు. అది వాచ్ మెన్ గది కంటే చిన్నగా ఉండేదని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. తర్వాత జర్నలిస్ట్ గా, పీఆర్వోగా, ఇప్పుడు నిర్మాతగా మారి సక్సెస్ అయ్యాడని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు.
బేబి సినమా లాస్ట్ వారం 14న రిలీజ్ అయింది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. ముఖ్యంగా ఈ మూవీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈరోజుకు కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తోంది బేబి మూవీ.