Home > సినిమా > Sohel : పబ్లిసిటీకి కూడా డబ్బుల్లేవ్..స్టేజీపై కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్

Sohel : పబ్లిసిటీకి కూడా డబ్బుల్లేవ్..స్టేజీపై కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్

Sohel : పబ్లిసిటీకి కూడా డబ్బుల్లేవ్..స్టేజీపై కన్నీళ్లు పెట్టుకున్న సోహెల్
X

బిగ్బాస్ లో "కథవేరుంటదీ" అని... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సోహెల్ వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నారు. కాగా ఆ మూవీస్ లో మిస్టర్ ప్రెగ్నెంట్ తప్ప మిగిలినవి ఏవి అనుకున్నంత హిట్ కాలేదు. అయితే త్వరలోనే సోహెల్ బూట్‌కట్ బాలరాజు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 2 థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరో రోలే కాకుండా నిర్మాత రోల్ పోషిస్తున్నాడు సోహెల్. తాజాగా ఏర్పాటు చేసిన బూట్‌కట్ బాలరాజు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సోహెల్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

తన నాన్న రిటైర్మెంట్ పైసలు, ఇల్లు కొనుక్కుందామని తను సంపాదించి డబ్బులన్నీ ఈ సినిమాకు ఇన్వెస్ట్ చేసినట్లు చెప్పాడు. సినిమాకు అందరూ కష్టపడతారనీ..చిత్రపరిశ్రమలో తను ఏడ్చిన రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. కొంతమంది ఎంకరేజ్ చేయకుండా..హీరోగా పనిచేయను, నిలబడనని ఎగతాళి చేశారని చెప్పుకొచ్చాడు. సినీ పరిశ్రమలో సపోర్ట్ ఉంటేనే నిలబడతామని స్పష్టం చేశారు.

తను సినిమాల్లోకి వస్తానంటే పేరెంట్స్ కష్టాల్లో ఉన్నా తనకు సపోర్ట్ చేశారన్నారు. ఎంత కష్టపడ్డా ఇంకా ఫైట్ చేస్తానని...కొన్నిసార్లు డిప్రెషన్ లోకి వెళ్ళానని చెప్పాడు. ఒక్కోసారి లైఫ్ క్లోజ్ చేసుకుందాం అని సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయని తన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఇంట్లో పేరెంట్స్ కోసం బతకాలి మనం అంటూ ఎమోషనల్ అయ్యాడు. స్పీచ్ లాస్ట్ లో స్టేజిపై మోకాళ్ళ మీద కూర్చొని అందరికి దండం పెడుతూ..ఇంతకంటే ఏం చెప్పలేను...సినిమాను థియేటర్ కి వచ్చి చూడండి అంటూ ప్రాధేయపడ్డాడు. పబ్లిసిటీ చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవనీ..బూట్ కట్ బాలరాజు ఫిబ్రవరి 2 థియేటర్లోకి వచ్చి చూడండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో సోహెల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




Updated : 30 Jan 2024 7:55 AM IST
Tags:    
Next Story
Share it
Top