Home > సినిమా > ఆ కొరియోగ్రాఫర్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు..కృతి సనన్

ఆ కొరియోగ్రాఫర్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు..కృతి సనన్

ఆ కొరియోగ్రాఫర్ నాతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు..కృతి సనన్
X

మహేష్ బాబు సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. అనంతరం నాగ చైతన్యతో దోచేయ్ మూవీలో నటించింది. మొదటి సినిమా ఆవరేజ్‎గా ఆడటం, రెండే సినిమా ఫ్లాప్ కావడంతో టాలీవుడ్‎లో కృతికి పెద్దగా అవకాశాలు రాలేదు. అదే సమయంలో బాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాలు కృతి ఇమేజ్‎ను పెంచేశాయి. దీంతో అక్కడే సెటిల్ అయ్యింది ఈ బ్యూటీ. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంటోంది. ఆ ఇమేజ్‎తోనే ఇప్పుడు రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. రాముడి పాత్ర పోషిస్తున్న ప్రభాస్‎కు సీతగా కృతి నటిస్తోంది. ఈ సినిమా జూన్ 16న విడుదల కాబోతోంది. దీంతో ప్రమోషన్లతో చిత్ర యూనిట్ బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి తన కెరీర్‎లో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. ఆ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.



ఇంటర్వ్యూలో కృతి మాట్లాడుతూ.."నేను మోడలింగ్ ఫీల్డ్‎లోకి వచ్చినప్పుడు అక్కడి వాతావరణం, వ్యక్తుల గురించి పెద్దగా తెలియదు. ఓసారి ర్యాంప్ షోలో వాక్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆ సమయంలో కొరియోగ్రాఫ‌ర్ న‌న్ను ఇన్సల్ట్ చేయడమే కాదు, నాతో అస‌భ్యంగా బిహేవ్ చేశాడు. ఆ విషయంలో నేను చాలా బాధ పడ్డాను. దాదాపుగా ఈ ఫీల్డ్ నుంచి వెళ్లిపోవాలనుకున్నాను. అమ్మ‌కు కాల్ చేశాను.ఆమె నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ప్ర‌తీ చోట ఇలాంటి ఇబ్బందులుంటాయని చెప్పుకొచ్చింది. వాటిని దాటితేనే విజయం వరిస్తుందని తెలిపింది. ఆమె అలా ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇప్పుడు ఇక్క‌డ ఉన్నాను. ఆమె మాట‌ల‌ను ఎప్ప‌టికీ మ‌ర‌చిపోను" అని చెప్పింది కృతి స‌న‌న్‌.








Updated : 12 Jun 2023 2:14 PM IST
Tags:    
Next Story
Share it
Top