Home > సినిమా > మహేష్.. నువ్వు చూసేటప్పుడు చెప్పు..నేనూ వస్తా : షారుఖ్

మహేష్.. నువ్వు చూసేటప్పుడు చెప్పు..నేనూ వస్తా : షారుఖ్

మహేష్.. నువ్వు చూసేటప్పుడు చెప్పు..నేనూ వస్తా : షారుఖ్
X

పఠాన్ సూపర్ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న మూవీ జవాన్. తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార హీరోయిన్గా నటించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేశారు. దీనికి షారుఖ్ ఇచ్చిన రిప్లై చూసి ఇద్దరి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

‘‘ఇది జవాన్ టైం. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరకుంటున్నా’’ అని మహేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు షారుఖ్ రిప్లై ఇచ్చారు. మహేష్తో కలిసి సినిమా చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ‘‘థ్యాంక్యూ సో మచ్‌ మై ఫ్రెండ్‌. జవాన్‌ నీకు కచ్చితంగా నచ్చుతుంది. నువ్వు ఎప్పుడు ఈ సినిమాను చూడాలనుకుంటున్నావో చెప్తే.. నేను కూడా నీతో కలిసి సినిమాకు వస్తా’’ అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్గా మారాయి.

Updated : 6 Sept 2023 9:25 PM IST
Tags:    
Next Story
Share it
Top