Home > సినిమా > మీరు రావాల్సిన అవసరం లేదు..నేనే మీదగ్గరికి వస్తాను.. రాఘవ లారెన్స్

మీరు రావాల్సిన అవసరం లేదు..నేనే మీదగ్గరికి వస్తాను.. రాఘవ లారెన్స్

మీరు రావాల్సిన అవసరం లేదు..నేనే మీదగ్గరికి వస్తాను.. రాఘవ లారెన్స్
X

రాఘవ లారెన్స్...డ్యాన్సర్ నుంచి స్టార్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలతో ఓ పక్క క్యారెక్టర్ ఆర్టీస్ట్ గా, కొరియోగ్రాఫర్ గా చాలా సినిమాల్లో నటించారు. కొరియోగ్రాఫర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా, డెరెక్టర్ గా అద్భుతమైన విజయాలు అందుకున్నాడు. అంతేగాక అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. తన సినిమాల్లో కూడా ప్రేక్షకులకు ఏదో ఒక సందేశం ఇస్తూ ఉంటాడు. తన తల్లి పేరిట ఛారిటబుల్ ట్రస్ట్ ను మొదలు పెట్టి ఎంతో మంది అనాథలకు,పేదలకు సహాయం అందిస్తున్నాడు. అందుకే ఆయన్ని ఒక హీరోగా కంటే మంచి మనసున్న వ్యక్తిగా చాలా మంది అభిమానిస్తుంటారు.

అయితే తాజాగా లారెన్స్ మాస్టర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై స్వయంగా తానే అభిమానులను కలుస్తానని చెప్పుకొచ్చాడు. ఇటీవల చెన్నైలో ఫ్యాన్స్ ను మీట్ అయ్యారు లారెన్స్. అందులో భాగంగా చాలా మందితో ఫోటో షూట్ కూడా నిర్వహించారట. ఆ గోలలో ఒక అభిమాని ప్రమాదానికి గురై చనిపోయాడు. దీంతో ఆ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన లారెన్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకనుండి తానే అభిమానులు ఉండే ప్రాంతానికి వస్తానని, తన కోసం ఎవరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియాలో లారెన్స్ మాస్టర్ పోస్ట్ చేశారు. దీంతో ఆయన ఫ్యాన్, నెటిజన్స్ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated : 25 Feb 2024 12:39 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top