title: రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తాను....కమల్ హాసన్
X
హీరో విజయ్ దళపతి (Vijay) ‘తమిళ వట్రి కళగం’ పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha elections) పోటీ చేసేందుకు పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటానని విజయ్ ఇటీవల తెలిపాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్‌ని (Kamal Haasan) ఇదే ప్రశ్న అడగగా ఆయన ఈ అంశంపై ఆసక్తికరంగా స్పందించారు.
ముందుగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. అతను రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు ప్రోత్సహించిన వారిలో తానూ ఉన్నట్లు చెప్పారు. అయితే రాజకీయాల గురించి మేము చర్చించుకున్నామని తెలిపారు. అయితే ఒకదానిలో కొనసాగాలంటే మరో రంగాన్ని విడిచి పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయాలా? సినిమాలా? అన్నది విజయ్ వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. అంతేగాక విజయ్ చేసే సినిమాలు విభిన్నంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. తనను అలా చేయమంటే ఎలా? అని అన్నారు. ఉదాహరణకు అద్భుతంగా పాటలు రాసే ఓ రచయితలా మీరు పాట రాయండి అంటే అది సాధ్యం కాదు కదా అని చెప్పారు. అలాగే ఎవరి సామర్థ్యం వారిదని... రాజకీయాల్లో ఉంటూనే సినిమాలు చేస్తానని కమల్ హాసన్ స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం కమల్ హాసన్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’అనే మూవీలో నటిస్తున్నారు. మరోవైపు హీరో విజయ్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’(goat) మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.