60 ఏళ్ళల్లో కూడా డాన్స్ చేయాలని ఉంది- తమన్నా
X
ఒకే నెలలో తమన్నావి రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. రజనీ కాంత్ తో నటించిన జైలర్, చిరంజీవితో నటించిన భోళా శంకర్ సినిమాలు రెండూ ఆగస్టు లోనే రిలీజ్ అవుతున్నాయి. ఆల్రెడీ వీటిల్లో పాటలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. కావాలయ్యా సాంగ్ అయితే సూపర్ పాపులర్ అయిపోయింది కూడా. దీంతో ఫుల్ బిజీ అయిపోయింది తమన్నా. దీంతో ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూలు ఇచ్చేస్తోంది.
అయితే తాజాగా తమన్నాకు ఎదురవుతున్న ప్రశ్నలు...మీకన్నా వయసులో పెద్దవాళ్ళతో నటించడం ఏంటి అని? దానికి తమన్నా....సినిమాలో నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం ఎందుకు చూస్తున్నారు? అందులో పాత్రలను మాత్రమే చూడాలి. నా మట్టుకు నాకయితే 60 ఏళ్ళ వయసులోనూ టామ్ క్రూజ్ లా విన్యాసాలు చేస్తాను. సాసీలా డాన్స్ చేయాలని ఉంది అంటూ సమాధానం ఇచ్చింది. అలాంటి గొప్ప నటులతో పని చేయడాన్ని ఎవరైనా కాదనుకుంటారా అని అడిగింది. వాళ్ళతో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది తమన్నా. అలాగే విజయవర్మ ఫోటో చూపిస్తే....అతను నా రియల్ హీరో అని చెప్పింది.తమన్నా, రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల అవుతోంది. చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల అవుతోంది.