Home > సినిమా > సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. కేంద్రం ఏమన్నదంటే..?

సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. కేంద్రం ఏమన్నదంటే..?

సెన్సార్ బోర్డుపై విశాల్ ఆరోపణలు.. కేంద్రం ఏమన్నదంటే..?
X

ముంబై సెన్సార్ బోర్డుపై హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మూవీ మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ రిలీజ్‌ కోసం లంచం అడిగారని ఆరోపించాడు. మార్క్ ఆంటోనీ హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కోసం రూ.3 లక్షలు, సర్టిఫికేట్ కోసం మరో రూ.3.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వీడియోలో స్పష్టం చేశారు. వీడియోతో పాటు మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసిన అకౌంట్స్‌ నెంబర్లను ఆయన పోస్ట్ చేశారు. విశాల్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ క్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పందించింది. సీబీఎఫ్సీలో అవినీతి అంశం చాలా దురదృష్టకరమని ట్వీట్ చేసింది. ఈ వ్యవహారంపై ఓ సీనియర్ అధికారి విచారణ కోసం ముంబై పంపిస్తున్నట్లు చెప్పింది. ఈ విచారణలో ఎవరైన తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. సీబీఎఫ్‌సీ వల్ల ఎవరైన వేధింపులకు గురైతే తమకు తెలపాలని మంత్రిత్వశాఖ సూచించింది.




Updated : 29 Sept 2023 4:50 PM IST
Tags:    
Next Story
Share it
Top