ఈ సినిమా ఓ అద్బుతం.. హాయ్ నాన్నపై అల్లు అర్జున్ రివ్యూ..
X
నేచురల్ స్టార్ నాని (natural star nani), మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం హాయ్ నాన్న. ఇటీవల విడుదలైన ఈ చిత్రం నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమా చూసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హాయ్ నాన్న చిత్రంపై రివ్యూ ఇచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసించారు.
"హాయ్ నాన్న (Hi Nana)చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమా చాలా బాగుంది. నిజంగా హృదయానికి హత్తుకుంది. సోదరుడు నాని ఎంతో అలవోకగా నటించేశాడు. ఇంత మంచి స్క్రిప్టును తెరకెక్కించినందుకు మూవీ యూనిట్ పై గౌరవం పెరిగింది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ ఆకట్టుకుంది. మృణాల్లాగే ఆమె నటన కూడా అందంగా ఉంది. బేబీ కియారా (Baby kiara) క్యూట్‌నెస్‌తో అందరి మనసులు దోచేసింది. అలాగే ఈ చిత్రం కోసం పనిచేసిన టెక్నికల్ టీంకు అభినందనలు.
దర్శకుడు శౌర్యువ్ మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకున్నారు. భావోద్వేగంతో కన్నీళ్లు తెప్పించారు. ఆయన ఇలాంటి మరెన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కేవలం నాన్నల హృదయాలనే కాదు.. కుటుంబంలోని అందరి మనసులనూ హత్తుకుంటుంది’’ అని అల్లు అర్జున్ రివ్యూ రాసుకొచ్చారు.
అల్లు అర్జున్ పోస్ట్‌కు నాని రిప్లై ఇచ్చారు. ‘‘ధాంక్యూ బన్నీ. మంచి సినిమాను ప్రోత్సహించడంలో మీరెప్పుడూ ముందుంటారు అని రాశారు. డిసెంబర్ 7న విడుదలైన ‘హాయ్ నాన్న’ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకున్న నాని తొమ్మిదో సినిమాగా నిలిచింది.