ఫ్యాన్స్కు అల్లు అర్జున్ బిగ్ సర్ప్రైజ్.. స్పెషల్ వీడియో
X
పుష్ప.. అల్లు అర్జున్కు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన మూవీ. 2021లో రిలీజైన ఈ మూవీ దేశవ్యాప్తంగా బ్లాక్ బాస్టర్గా నిలిచింది. పుష్ప రాజ్గా అల్లు అర్జున్ యాక్టింగ్కు అందరు ఫిదా అయ్యారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2024లో ఈ మూవీ విడుదల కానుంది. నేషనల్ అవార్డుతో బన్నీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ టీం అల్లు అర్జున్తో స్పెషల్ వీడియో తీసింది. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్గా మారింది.
ఉదయం తన డే స్టార్ట్ నుంచి సాయంత్రం వరకు ఏమేం చేస్తారో అల్లు అర్జున్ ఈ వీడియోలో చూపించారు. ముందుగా ఇంట్లోని గార్డెన్లో యోగ చేయడం.. ఆ తర్వాత కాఫీ తాగడం.. అక్కడి నుంచి పుష్ప షూటింగ్కు వెళ్లడం వంటివి ఈ వీడియో ఉన్నాయి. మధ్యాహ్నం ఇంటిగంట అవ్వగానే తన పిల్లలకు ఫోన్ చేస్తానని బన్నీ చెప్పారు. పుష్ప మూవీ షూటింగ్ జరుగుతున్న తీరు.. తన మేకప్, కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ చూపించారు. డైరెక్టర్ సుకుమార్తో తనకు 20 ఏళ్ల బంధం అని.. ఇది తనకు 20 సినిమా అని బన్నీ చెప్పారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.