Home > సినిమా > ఒకే ఒక్క పోస్టర్..పుష్ప-2 స్టోరీ మొత్తం లీక్..

ఒకే ఒక్క పోస్టర్..పుష్ప-2 స్టోరీ మొత్తం లీక్..

ఒకే ఒక్క పోస్టర్..పుష్ప-2 స్టోరీ మొత్తం లీక్..
X

సుకుమార్ డైరెక్షన్‎లో మైత్రీ మూవీ మేక‌ర్స్‌ నిర్మాణంలో వచ్చిన 'పుష్ప' ది రైజ్ మూవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పాన్ ఇండియా స్టార్‌గా మార్చేసింది . రూ.300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబట్టి బన్నీ పవర్‎ను అమాంతం పెంచేసింది. టాలీవుడ్ సహా ఇత‌ర ద‌క్షిణాది చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో బన్నీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్‌ సైతం బన్నీ యాక్టింగ్‎కు ఫిదా అయ్యింది. ఎవ‌రూ ఊహించ‌ని రేంజ్‌లో ఈ సినిమా స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి 'పుష్ప 2' పై పడింది. వచ్చే ఏడాది ఆగస్టు 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‎ను విడుదల చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‎లో ఉత్సాహం రెట్టింపైంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‎లో పుష్ప-2 స్టోరీ మొత్తం లీక్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

పుష్ప తొలి భాగంలో ఎర్ర చందనం కూలిగా పుష్పరాజ్ కనిపించాడు. తన తెలివితేటలు, ధైర్యంతో సిండికేట్‌కు బాస్‌గా ఎలా ఎదిగాడ‌ు అనేది డైరెక్టర్ సుకుమార్ చూపించాడు. ఇక సీక్వెల్‎లో ఐపీఎస్ ఆఫీస‌ర్ బైరాం సింగ్ షెకావ‌త్‌కి, పుష్పరాజ్‌కి మ‌ధ్య వ‌చ్చిన ఈగో కారణంగా వారిద్దరి మధ్య గొడ‌వ‌లు ఎంత వ‌ర‌కు వెళ్లాయి. దాని వ‌ల్ల ఎవ‌రికి ఏమైంద‌నేది డైరెక్టర్ చూపించ‌బోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో తాజాగా చిత్ర యూనిట్ పుష్ప 2 రిలీజ్ డేట్‏తో పాటు ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఆపోస్టర్‎లో అందరినీ ఒక అంశం ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌ మొత్తం ఆకట్టునేలా ఉన్నా ..పుష్ప రాజ్ చివరి వేలుకు గులాబీ రంగు నెయిల్ పాలిష్ ఉండటం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పోస్టర్‏లో బన్నీ మిగతా వేళ్లు నార్మల్‎గా ఉన్నాయి. చిటికెన వేలు గోరు పొడవుగా ఉండటం దానికి రంగు వేసి ఉండటంతో ఇప్పుడు ఇదే హైలైట్‎గా అయ్యింది. దీని వెనుక అసలు కథ మొత్తం దాగి ఉందని సమాచారం.

చేతిలోని చివరి గోరు పొడవుగా ఉండటం చిత్తూరులోని కొన్ని ప్రాంతాల సంస్కృతి అంటున్నారు. విభిన్న రంగాల్లో ఆధిపత్యం వహించే వారి చేతిపై పొడవాటి గోరు ఉంటుందని సమాచారం. ఈ గోరును ఇలా పెంచడాన్ని సంపదగా భావిస్తారట. ఉన్నత సామాజిక స్థితిని ఈ ఒక్క గోరే సూచిస్తుంది అని టాక్ . అలాగే కూలీ‏గా సామాన్య జీవితం గడిపిన వ్యక్తి గొప్ప వ్యక్తిగా ఎదిగిన తీరుకి ఇది చిహ్నమని చెబుతున్నారు..చిత్తూరు జిల్లాలో ఈ సంస్కృతి ఉన్నట్టు నెటిజెన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు . ఈ వేలి గోరు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. సుకుమార్ ఇంత చిన్న విషయాలపై కూడా శ్రద్ధ చూపడాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. పుష్ప -2 ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక నటిస్తుంది .. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ మొదటి భాగానికి మించి సంగీతాన్ని అందిస్తున్నారు. మరి పుష్ప 2 సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియాలంటే 2024 వరకు ఎదురుచూడాల్సిందే.



Updated : 12 Sep 2023 8:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top