సంగీత శిఖరం ఇళయరాజా బయోపిక్ షూటింగ్ స్టార్ట్
X
మ్యాస్ట్రో ఇళయరాజా జీవిత కథ.. సినిమాగా వెండితెరపైకి రానుంది. ఇందులో ఇళయరాజా పాత్రను హీరో ధనుష్ చేస్తున్నారు. గతంలోనే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. తాజాగా నేడు ఇళయరాజా బయోపిక్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. వెయ్యికిపైగా చిత్రాలకు స్వరాలు అందించిన ఇళయరాజా భారతీయ సంగీత ప్రపంచంలో లివింగ్ లెజెండ్‌గా కొనియాడుతున్నారు. ఆయన బయోపిక్‌కు హీరో ధనుష్ పర్‌ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పాలి. కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంయుక్తంగా ఈ మూవీని రూపొందిస్తున్నాయి. రీసెంట్‌గా ధనుష్ హీరోగా చేసిన కెప్టెన్ మిల్లర్ మూవీ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
కెప్టెన్ మిల్లర్ మూవీ తర్వాత హీరో ధనుష్ తెలుగు డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కుబేర మూవీని స్టార్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఇళయరాజా బయోపిక్ మూవీని కూడా ధనుష్ మొదలెట్టారు. ఈ సినిమాలో చాలా మంది తమిళ, తెలుగు హీరోలు గెస్ట్ రోల్స్‌లో కనిపించే అవకాశం ఉంది. ఈ మూవీ ప్రారంభోత్సవానికి యూనివర్సల్ హీరో కమల్ హాసన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. సుమారు 7 వేలకు పైగా పాటలకు ఇళయరాజా సంగీతం అందించారు.
దళిత కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించారు. ఆయన సినిమా కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఈ మూవీలో చెప్పనున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ కూడా ఈ మూవీలో నటించే అవకాశం ఉంది. 50 ఏళ్లలో ఇళయరాజా 20 వేలకు పైగా కచేరీలు చేశారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీలల్లో అగ్రహీరోలందరికీ ఆయన ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చారు. ఆయన జీవిత కథను థియేటర్లలో చూసేందుకు అభిమానులంతా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.