Home > సినిమా > నా కళ్లు తుడిచాడు..నాతో ఉన్నాడు..ఇలియానా

నా కళ్లు తుడిచాడు..నాతో ఉన్నాడు..ఇలియానా

నా కళ్లు తుడిచాడు..నాతో ఉన్నాడు..ఇలియానా
X

పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యింది నటి ఇలియానా. ఈ విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇలియానా చాలా యాక్టివ్‎గా కనిపిస్తూ తన ఫ్యాన్స్‎‎తో టచ్‎లో ఉంటోంది. తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సీక్రెట్‎గా ఉంచిన ఇలియానా అమ్మగా ప్రతి దశలో తన అనుభూతులను మాత్రం చెబుతోంది. తాజాగా ఇలియానా మాతృత్వం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేయడంతో పాటు మొదటిసారిగా తన బాయ్ ఫ్రెండ్ పిక్ ను నెట్టింట్లో షేర్ చేసింది. దీంతో ప్రస్తుతం ఇలియానా పోస్ట్ వైరల్ అవుతోంది.


ఇలియానా తన ఇన్‎స్టాగ్రామ్ ప్రొఫైల్‎లో ఓ పిక్‎ను షేర్ చేసి ఎమోషనల్ నోట్‎ను పోస్ట్ చేసింది. " ఆడవారికి మాత్రే దక్కే అదృష్టం అమ్మతనం. ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు ప్రతి దశ ఓ అపురూపమైన ప్రయాణం. ఈ అనుభూతిని మాటల్లో వర్ణించలేను. అమ్మగా ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నా కడుపులో ప్రాణం జీవం పోసుకొంటుందన్న ఊహే ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. నా బిడ్డ ఈ లోకంలోకి రాగానే తనని ఎంతగా ప్రేమిస్తానా, ఏ విధంగా లాలిస్తానో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం తనని అమితంగా ఇష్టపడుతున్నా. నా లైఫ్‎లో రీసెంట్‎గా ఎన్నో కష్టమైన రోజులు గడిచాయి. ఆ రోజులు నన్న చాలా ఇబ్బంది పెట్టాయి. కానీ వాటి నుంచి నేను మెళ్లిగా బయటపడ్డాను.ఆ సమయంలో నాతో అతను ఉన్నాడు. నా కన్నీళ్లు తుడిచాడు, నా లైఫ్ లో తిరిగి ఆనందాన్ని తీసుకువచ్చాడు. ’’ అంటూ తన బాయ్ ఫ్రెండ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది ఇలియానా. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Updated : 11 Jun 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top