Home > సినిమా > తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన ఇలియానా

తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన ఇలియానా

తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పిన ఇలియానా
X

తన ఒంపుసొంపులతో అందరినీ ఆకట్టుకున్న నటి ఇలియానా. దేవదాసు మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్తో అతితక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌స్టర్స్‌ తోనూ జతకట్టింది ఈ భామ. ఆ తర్వాత టాలీవుడ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టి బాలీవుడ్‌కు మకాం మార్చేసింది. కానీ అక్కడ అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఆమె డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే కొద్దికాలానికే వారు విడిపోయారు.

ప్రస్తుతం ఇలియానా గర్భవతి. అయితే తన బాయ్ఫ్రెండ్ ఎవరో మాత్రం ఆమె ఇంత వరకు చెప్పలేదు. దీంతో ఆమెపై నెటిజన్లు పలు విమర్శలు గుప్పించారు. తాజాగా అతడికి సంబంధించిన విషయాలను ఈ భామ రివీల్ చేసింది. ‘‘తల్లి కావడం అనేది అతిపెద్ద వరం. ఇటువంటి వరాన్ని నేను పొందుతానని అనుకోలేదు. కాబట్టి ఈ ప్రయాణాన్ని అదృష్టంగా భావిస్తున్నా. నా బేబీ బంప్‌ చూస్తుంటే చాలా ముద్దొస్తుంది. ఈ అనుభూతి ఎంత మనోహరంగా ఉందో వర్ణించలేకపోతున్నా. నా బేబీని త్వరలో కలుస్తాను. భవిష్యత్తులో పుట్టబోయే బేబీని ఎలా చూసుకుంటానో నాకు తెలియదు కానీ, ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్నా’’ అని చెప్పింది.

ఇక తన బాయ్ ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ‘‘అలాగే కొన్ని కష్టమైన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని పరిస్థితులు గందరగోళానికి గురి చేశాయి. మరొకొన్ని పరిస్థితులు నిస్సహాయతను కలిగించాయి. అలాంటి సమయంలో చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి అని నాకు నేనే ధైర్యాన్ని ఇచ్చుకున్నాను. నా గురించి నేనే మర్చిపోయిన రోజుల్లో ఈ వ్యక్తి నాకు అండగా నిలిచాడు. నాలో ధైర్యాన్ని నింపాడు. కన్నీళ్లు తుడిచి.. చిరునవ్వులు తెప్పించాడు. నాకు ఎప్పుడు ఏం కావాలో అర్థం చేసుకుని.. నా చెంతనే నిలిచాడు. ఇకపై, ఏదీ కష్టంగా అనిపించదు’’ అని రాసుకొచ్చింది.

దీనికి అతడితో దిగిన ఫొటోను జతచేసింది. అయితే అందులో అతడి మొహం మాత్రం క్లారిటీగా లేదు. కాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ఎఫైర్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ విషయంపై వారిద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.





Updated : 10 Jun 2023 4:58 PM IST
Tags:    
Next Story
Share it
Top