Home > సినిమా > బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా....

బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా....

బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలిసిపోయిందిగా....
X

పోకిరి భామ....నాజూకు నడుము పిల్ల ఇల్లీ బేబీ మరో పిల్లకు తల్లి అవుతున్న సంగతి తెలిసిందే. ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి అప్డేట్స్ ఇస్తూనే ఉంది పోకిరి భామ. అయితే ఇప్పటివరకు పెళ్ళయిందా లేదా...ఎవరితో అయింది లాంటి విషయాలు ఎప్పుడూ బయటపెట్టలేదు. ఎవరికి వారు అతను...ఇతను అంటూ ఊహించేసుకున్నారు. వాటన్నింటికీ తెరదించేస్తూ....చివరకు తన బాయ్ ఫ్రెండ్ ను చూపించేసింది.

లేటెస్ట్ గా ఇలియానా ఇన్స్టాలో పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆమె తొమ్మది నెలల గర్భంతో ఉంది. ఈ స్టేజ్ లో బాయ్ ఫ్రెండ్ తో డేట్ నైట్ అంటూ బాయ్ ఫ్రెండ్ ఫోటోను పెట్టింది. దీంతో అందరి ఊహాగానాలకు చెక్ పెట్టినట్టు అయింది. అయితే అతని పేరేంటో మాత్రం చెప్పలేదు.

తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన ఇలియానా...తర్వాత బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడ పెద్దగా సక్సెస్ అవలేకపోయింది. ఆ తరువాత మళ్ళీ తెలుగులోకి రావాలని ప్రయత్నించింది....వచ్చింది కానీ అప్పటికే ఆమె ఫేడ్ అవుట్ అయిపోవడం వలన ఉండలేకపోయింది. ముందు ఒక ఆసట్రేలియన్ ఫోటోగ్రాఫ్ తో రిలేషన్ లో ఉంది ఇలియానా. వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకున్నారని చెబుతారు. కానీ కొన్నేళ్ళ తరువాత వాళ్ళు విడిపోయారు. తరువాత కత్రినీ కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ తో రిలేషన్ లో ఉంది అన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం కడుపులో ఉన్న బిడ్డకు అతనే తండ్రి అని కూడా అన్నారు. కానీ ఇప్పుడు పెట్టిన ఫోటోలతో అది సెబాస్టియన్ కాదని తెలిసిపోయింది. ఇన్స్టాలో పెట్టిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో బిడ్డ పుట్టేలోపు చెబుతుందేమో అని వెయిట్ చేస్తున్నారు ఆమె అభిమానులు.






Updated : 17 July 2023 11:46 AM IST
Tags:    
Next Story
Share it
Top