Home > సినిమా > నేనేమి సూపర్ హీరోను కాను..అందుకే ఆ విషయంలో తగ్గా..సిద్దార్థ్

నేనేమి సూపర్ హీరోను కాను..అందుకే ఆ విషయంలో తగ్గా..సిద్దార్థ్

నేనేమి సూపర్ హీరోను కాను..అందుకే ఆ విషయంలో తగ్గా..సిద్దార్థ్
X

హీరో సిద్దార్థ్ గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా తన గొంతును వినిపిస్తూ నిత్యం ట్విటర్‎లో యాక్టివ్ గా ఉండే సిద్దూ గత కొంత కాలంగా సైలెంట్ అయ్యాడు. తెలుగు సినిమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలో చాలా రోజుల గ్యాప్ తరువాత తెలుగు సినిమా థియేటర్లలలో టక్కర్ సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ట్విటర్‎కు దూరంగా ఉండటంపై స్పందించాడు. ఒంటిరిగా పోరాటం చేయలేకపోతున్నానని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.



ఇంటర్వ్యూలో సిద్దార్థ్ మాట్లాడుతూ.." నన్ను యాక్టివిస్ట్‌ అంటే నవ్వొస్తుంది. నేను కేవలం నిజం వైపు నిలబడి నా వాయిస్‎ను వినిపిస్తాను. ఒక యాక్టర్‎గా ఇంతకాలం చాలా విషయాలపై మాట్లాడాను. కానీ నాతో ఏ విషయంలోనూ నా కో స్టార్ తోడుగా రాలేదు. మీరెందుకు మీ గొంతు విప్పడం లేదని ఎవరూ వారిని ప్రశ్నించ లేదు. అందుకే నేనే కాస్త వెనక్కి తగ్గాను. నేనే ఎందుకు మాట్లాడాలి. ఈ ప్రపంచంలో ఎన్నో దుష్టశక్తులు ఉన్నాయి. వాటిపై నేనొక్కడినే పోరాటం చేయలేనని డిసైడ్ అయ్యాను. నేనేమీ సూపర్‌హీరోని కాదు. నా టాలెంట్ చూసి ఫిల్మ్‌మేకర్స్‌ భారీ పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి, నేను వారికి ప్రయారిటీ ఇస్తున్నాను"అని సిద్దార్థ్ తెలిపాడు.

పోయిన సంవత్సరం సిద్దార్థ్, సైనా నెహ్వాల్ ట్విటర్ ను ఉద్దేశిస్తూ ఓ ట్విట్ చేశాడు. ఆ ట్విట్ నెట్టింట్లో పెద్ద దుమారమే లేపింది. ఇద్దరి మధ్య ఓ రకంగా ట్విటర్ వార్ జరిగింది. అప్పట్లో సైనా ప్రధాని భద్రతా వైఫల్యం గురించి ఆందోళన చెందుతూ ఓ పోస్ట్ పెట్టింది. దానికి సిద్దార్థ్ సెటైరిక్‎గా కామెంట్ చేశాడు. ఈ విషయం కాంట్రవర్సీ కావడంతో సిద్దార్థ్ సైనాకు క్షమాపణలు కూడా చెప్పాడు. ఈ ఘటన తరువాత సిద్దూ ట్విటర్‎లో సైలెంట్ అయ్యాడు. పెద్దగా యాక్టివ్‎గా ఉండటం లేదు.

Updated : 6 Jun 2023 5:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top