ఆకట్టుకుంటున్న 'యమధీర' ట్రైలర్.. డైలాగ్స్ అదుర్స్
X
కోమల్ కుమార్ హీరోగా, క్రికెటర్ శ్రీశాంత్ విలన్‌గా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న మూవీ యమధీర. సినీ ఇండస్ట్రీలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఇప్పటి వరకూ సినిమాలు రాలేదు. అటువంటి కథాంశంతో వస్తోన్న మూవీ యమధీర ఈ నెల 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. శ్రీమందిరం ప్రొడక్షన్స్‌పై వేదాల శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నేడు విడుదలైన యమధీర ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ట్రైలర్‌లో హీరోయిజంతో పాటు నాగబాబు, ఆలీ, మధుసూదన్, సత్య ప్రకాష్ చెప్పే డైలాగ్స్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ మంచి టైమింగ్‌తో ఈ మూవీని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో కోమల్ కుమార్ అద్భుతంగా నటించారు. సినిమా చాలా వరకూ ఫారిన్ లొకేషన్స్‌లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి, పోలింగ్ గురించి చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఈ జనరేషన్‌కు మంచి మెస్సేజ్ ఇచ్చేందుకు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
గన్ నుంచి వచ్చే తూటాను ఎలాగైతే ఆపలేమో..అలాగే వాడ్ని కూడా ఆపలేం సార్, వేటగాడికి వేటను చూపించకూడదు..చూపించాల్సింది ఆశ మాత్రమే, సునామీ వస్తే ఎలా అన్నీ కొట్టుకుపోతాయో..వాడు అదే పనిచేస్తాడు...అనే డైలాగ్స్ ట్రైలర్‌కు హైలెట్‌గా నిలిచాయి. హీరో చేసే ఫైట్స్, సాంగ్స్, విజువల్స్ చాలా బావున్నాయి. విదేశాల్లో ఫ్రెష్ లొకేషన్లలో తీసిన షాట్స్ అద్భుతంగా ఉన్నాయి. కన్నడలో వంద సినిమాల్లో నటించిన హీరో కోమల్ కుమార్‌పై విలన్‌గా శ్రీశాంత్ ఢీకొట్టనున్నాడు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై ఎన్నికల సమయంలోనే విడుదలవుతున్న ఈ మూవీపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మార్చి 23న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.