Home > సినిమా > అల్లు అరవింద్ కంప్లైంట్.. రాజశేఖర్, జీవిత దంపతులకు జైలు శిక్ష

అల్లు అరవింద్ కంప్లైంట్.. రాజశేఖర్, జీవిత దంపతులకు జైలు శిక్ష

అల్లు అరవింద్ కంప్లైంట్.. రాజశేఖర్, జీవిత దంపతులకు జైలు శిక్ష
X

సెలబ్రిటి కపుల్ జీవిత, రాజశేఖర్‌‌లకు ఏడాది జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది నాంపల్లి కోర్టు. మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తోన్న బ్లడ్ బ్యాంక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం. అసలు విషయం ఏంటంటే.. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌.. తన బావ చిరంజీవి నిర్వహిస్తున్న బ్లడ్‌బ్యాంకుపై జీవిత, రాజశేఖర్ దంపతు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, అభిమానుల నుంచి రక్తాన్ని ఉచితంగా సేకరించి బయట మార్కెట్లో ఎక్కువ రేటుకు అమ్ముకుంటున్నారని ఆరోపించారంటూ 2011లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు


ముఖ్యంగా చిరంజీవి పేరుతో నడుస్తోన్న ట్రస్టు మరియు సేవా కార్యక్రమాలపై ఆ దంపతులు అసత్య ఆరోపణలు చేసారంటూ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఎన్నో ఏళ్ల విచారణ అనంతరం నాంపల్లిలోని 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు వీరిద్దరికి యేడాది జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జరిమానా విధించింది. అంతేకాదు ఈ కేసుపై అప్పీలుకు వెళ్లేందుకు ఛాన్స్ ఇస్తూ షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

జీవిత, రాజశేఖర్ ల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఉన్నపుడే హీరో రాజశేఖర్‌ను వివాహం చేసుకున్న జీవిత.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా... రాజశేఖర్ నటించిన కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా పని చేశారు. వారి కుమార్తెలు శివానీ, శివాత్మిక.. ప్రస్తుతం హీరోయిన్లుగా చేస్తున్నారు. తాజాగా జీవిత.. రజినీకాంత్ ముఖ్యపాత్రలో నటిస్తోన్న ‘లాల్ సలాం’ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తోంది. అటు రాజశేఖర్ కూడా కొన్ని వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

Updated : 19 July 2023 2:12 AM GMT
Tags:    
Next Story
Share it
Top