Home > సినిమా > Music Awards : గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డుల్లో సత్తాచాటిన భారత్

Music Awards : గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డుల్లో సత్తాచాటిన భారత్

Music Awards : గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డుల్లో సత్తాచాటిన భారత్
X

అన్ని రంగాల్లో భారత్ దూసుకెళ్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ‘గ్రామీ 2024’ మ్యూజిక్ అవార్డ్స్‌లో భారత్ మరోసారి దుమ్ములేపింది. ఇండియా మ్యూజిక్ దిగ్గజాలు జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్‌ల ఫ్యూజన్ బ్యాండ్ ‘శక్తి’కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్‌ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును అందుకునేందుకు శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, బృందం సభ్యులు లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవార్డు గెలుచుకున్న బృందంపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇండియన్ మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ మూడు సార్లు గ్రామీ అవార్డు దక్కించుకున్నారు. ఆయన ప్రసంగాన్ని శంకర్ మహదేవన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ‘శక్తి’ 2024 గ్రామీ అవార్డులను గెలుచుకుందని చెప్పారు. ఈ ఆల్బమ్ ద్వారా నలుగురు గొప్ప భారతీయ సంగీతకారులు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారని రికీ కేజ్ తెలిపారు. ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియాతో కలిసి శంకర్ మహదేవన్, సెల్వగణేష్, గణేష్ రాజగోపాలన్, ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ రెండో అవార్డును గెలుచుకున్నారని వివరించారు. కాగా జాన్ మెక్‌లాఫ్లిన్, జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్, వీ.సెల్వగణేష్, గణేష్ రాజగోపాలన్‌ల సహకారంతో ‘శక్తి’ బ్యాండ్‌ను రూపొందించారు.

Updated : 5 Feb 2024 11:26 AM IST
Tags:    
Next Story
Share it
Top