Home > సినిమా > 28 ఏళ్ల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ పోటీలు..

28 ఏళ్ల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ పోటీలు..

28 ఏళ్ల తర్వాత భారత్లో మిస్ వరల్డ్ పోటీలు..
X

మిస్ వరల్డ్ పోటీలు.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలు, తెలివితేటలతో అందరినీ ఆకట్టుకునే భిన్నమైన వేదిక. ఈ పోటీలకు భారత్ మరోసారి వేదిక కానుంది. 2024 మిస్ వరల్డ్ పోటీలను మనదేశంలో నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఈ పోటీ జరగనున్నాయి. ఢిల్లీలోని భారత్‌ మండపం, ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహిస్తున్నారు.1996లో ఈ అందాల పోటీలకు భారత్‌ వేదికైంది. మళ్లీ 28ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరిని నిర్ణయించే అవకాశం మన దేశానికి దక్కింది.

71వ మిస్ వర్డల్ పోటీలు భారత్ వేదికగా జరుగుతాయని చెప్పడానికి సంతోషంగా ఉందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ జులియా మేర్లే తెలిపారు. ‘‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యమిచ్చే దేశంగా భారత్‌ను ప్రకటిస్తున్నందుకు గర్వంగా ఉంది. అందం, వైవిధ్యం, సాధికారతతో కూడిన ఈ అద్భుతమైన వేడుకను చూసేందుకు సిద్ధంగా ఉండండి’’ ఆమె ట్వీట్ చేశారు. ఇక 2022లో కరోలినా బిలావ్‌స్కా మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్నారు. ఈ సారి ఎంపిక అయ్యే విజేతకు ఆమె కిరీటం అందజేయనున్నారు.

ఇప్పటి వరకు ఇండియా ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. 1966,1994,1997,1999, 2000,2017 భారత్ తరుపున పోటీచేసిన అందెగత్తెలు మిస్ వరల్డ్గా నిలిచారు. 1996 రీటా ఫారియా, 1994లో ఐశ్వర్యరాయ్‌, 1997లో డయానా హేడెన్‌, 1999లో యుక్తా ముఖీ, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్‌ మిస్‌ వరల్డ్‌గా నిలిచారు.


Updated : 19 Jan 2024 4:29 PM GMT
Tags:    
Next Story
Share it
Top