వైకింగ్స్ లుక్స్ లో సౌత్, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు
X
నార్స్ హీరోలలో ఒకరైన లాగ్నార్ లాత్ బ్రోక్ జైత్రయాత్రను చూపించే సీరస్ వైకింగ్స్. ఇంగ్లాండ్ మీద దాడి చేసి స్కాండినేవియా రాజుగా మారి...తన కుటుంబం, ఫ్రెండ్స్ అందరితో రాజ్యాన్ని ఏలతాడు. 2013లో వచ్చిన ఈ సీరీస్ చాలా పాపులర్ అయింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ అవైలబుల్ గా ఉన్న వైకింగ్స్ సీరీస్ ను ఇప్పటికీ చాలా మంది చూస్తూనే ఉంటారు. దీని సీక్వెల్ గా వైకింగ్ వల్హాలా అని మరొకటి కూడా వచ్చింది. అది కూడా సూపర్ హిట్ అయింది. అడవి మనుషుల్లా కనిపించే వైకింగ్స్ మహా బలవంతులు. వాళ్ళను గెలవడం ఎవరివల్లా కాదన్నట్టు ఉంటారు. వైకింగ్స్ పాత్రల్లో నటించిన నటులు ఆ సీరీస్ తర్వాత చాలా పాపులర్ కూడా అయిపోయారు.
ప్రస్తుతం ఏఐ మాయ నడుస్తోంది. ఈ కొత్త టెక్నాలజీతో రోజు కొత్త ఫోటోలు, వీడియోలు పుడుతున్నాయి. ఒకరి ప్లేస్ లో మరొకరి మోహం పెట్టడం...వీళ్ళు వాళ్ళల్లా ఉంటే ఎలా ఉంటారో చూపించడం లాంటివి చాలా చేస్తున్నారు. అలానే వైకింగ్స్ రూపాల్లో మన ఇండియన్ హీరోలు ఎలా ఉంటారో చూపిస్తున్నారు ఏఐ కింగ్స్. మహేష్ బాబు, హృతిక్ రోషన్, సూర్య, విక్రమ్ లాంటి వాళ్ళను ఏఐ సహాయంతో వైకింగ్స్ గా చూపిస్తున్నారు. ఏది ఏమైనా కానీ...వైకింగ్స్ రూపాల్లో మనవాళ్ళు అదిరిపోయారు. అతకినట్టు సరిపోయారు. మీరు కూడా ఆ ఫోటోలను చూసేయాలనుకుంటున్నారా...అయితే ఓ లుక్ వేసేయండి.