బిగ్ బాస్ -7 లో ఇండియన్ క్రికెటర్.. ?
X
మరో సారి అభిమానులను అలరించేందుకు తెలుగు బిగ్‌బాస్ -7 వచ్చేస్తోంది. ఆరు సీజన్‌ల విజయం తర్వాత ఏడో సీజన్‌ను సరికొత్త హంగులతో తీసుకొస్తున్నారు. మరోసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కనిపించనున్నారు. సుమారు 3 నెలల పాటు సాగే ఈ రియాలిటీ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బిగ్ బాస్-7 ఎనౌన్స్‌మెంట్ రావడంతో కంటెస్టెంట్స్ ఎవరు అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు నటీనటులు బిగ్ బాస్‌కు వెళ్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా మరొకరి పేరు బయటకొచ్చింది. ఈ సారి ఊహించని విధంగా ఇండియన్ క్రికెటర్ బిగ్ బాస్ -7 లో పాల్గొననున్నట్టు సమాచారం.
భారత మాజీ క్రికెటర్ వేణు గోపాలరావుని బిగ్‌బాస్ -7 తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనను ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎక్కువగా ఫేమస్ యూట్యూబర్స్, నటీనటులను తీసుకునే బిగ్ బాస్‌లోకి ఓ క్రికెటర్ వెళ్తున్నాడనే వార్త ఆసక్తి రేపుతోంది.
విశాఖకు చెందిన వేణుగోపాల్ రావు భారత క్రికెట్ జట్టు తరపున 2005లో శ్రీలంకతో జరిగిన తొలి వన్డే, 2006లో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడారు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశారు. ఐపీఎల్ ద్వారా వేణుగోపాల్ రావు మంచి పేరు సంపాదించుకున్నాడు. వేణుగోపాల్ రావు కెరీర్‌లో 65 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. రెండు దశాబ్దాలకు పైగా అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడిన వేణుగోపాలరావు ప్రస్తుతం తెలుగు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.